హైదరాబాద్ ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అయ్యింది. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ భాగ్యనగరానికి మరో మణిహారాన్ని జోడించబోతోంది. సుందరంగా తీర్చిదిద్దేందుకు స్కైవాక్ ల నిర్మాణాన్ని చేపట్టాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది.
హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే రోడ్లలో ఒకటైన మెహిదీపట్నం వద్ద పాదచారుల కోసం స్కైవాక్ ను నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెహదీపట్నంలో స్కైవాక్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ లకు రాష్ట్ర ఐటీ, మునిసిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ఆమోదం తెలిపినట్లుగా రాష్ట్ర మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
500 మీటర్ల పొడవున స్టీల్ తో స్కైవాక్ ను నిర్మించనున్నట్టు తెలిపారు. అక్కడి రైతుబజార్ లో రెండు లిఫ్టులతో పాటుగా, మొత్తం 16 లిఫ్ట్ లను ఏర్పాటు చేయనున్నారు.
ఈ స్కైవాక్ ప్రాజెక్టులో భాగంగా అక్కడి బస్ షెల్టర్లు కూడా రీడిజైన్ చేయబడతాయని అన్నారు. హెచ్ఎండీఏ త్వరలోనే స్కైవాక్ నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించనుందని అర్వింద్ కుమార్ పేర్కొన్నారు.
ఇక్కడే కాకుండా హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం ఇలా స్కైవాక్ లు నిర్మించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ హైదరాబాదీలను ఆకట్టుకునే పనికి కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.