పంచాయితీ ఎన్నికలు ఆపండి.. హైకోర్టులో పిటీషన్

Update: 2021-01-24 08:00 GMT
ఏపీ పంచాయితీ ఎన్నికలు ఖచ్చితంగా జరపాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఓవైపు.. ఎలాగైనా సరే జరగనీయమని ఏపీ ప్రభుత్వం, ఉద్యోగులు మరోవైపు అడ్డంగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ వేసిన పిటీషన్ విచారణకు వస్తుందో రాదోనన్న ఆందోళన నెలకొంది.

అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఏపీలో ఎన్నికలు జరపకూడదన్న సర్కార్ సంకల్పంతో ఉంది. ఈ క్రమంలోనే సర్కార్ కు మద్దతుగా చాలా మంది లూప్ హోల్స్ వెతకడం ప్రారంభించారు.

సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఎన్నికలు ఆపేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా ఓ విద్యార్థిని ఎన్నికలు ఆపాలంటూ హైకోర్టుకు ఎక్కడం హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో ‘పంచాయితీ’ ఎన్నికలపై మరో పిటీషన్ దాఖలైంది. ఎస్ఈసీ నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ ధర్మాసనంలో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలైంది.

గుంటూరుకు చెందిన ఓ విద్యార్థిని ఈ పిటీషన్ దాఖలు చేశారు. ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు ఉందంటూ ఆ పిటీషన్ లో పేర్కొంది.  2019 ఓటర్ జాబితా ప్రకారం ఎన్నికలు జరిగితే 3.60 లక్షల మంది ఓటు కోల్పోతారని అందుకే పంచాయితీ ఎన్నికల నోటిఫికేషణ్ రద్దు చేయాలని ఆ పిటీషన్ లో కోరింది.

మరి హైకోర్టు ఈ విద్యార్థిని మొర ఆలకిస్తుందా? ఎన్నికలు రద్దు చేస్తుందా? లేదా అన్నది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News