మీరో రెస్టారెంట్ వెళ్లారు. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేశారు. రుచిగా లేకపోవటమే కాదు.. సర్వీసు లోపం కొట్టొచ్చినట్లు కనిపించిందనుకుందాం. అప్పుడేం చేయాలి? అన్న ప్రశ్నకు ఎవరూ సూటిగా సమాధానం చెప్పలేరు. మహా అయితే.. ఆ రెస్టారెంట్ మేనేజర్ ను పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకోవటం మినహా ఏమీ చేయలేని పరిస్థితి.
ఫుడ్ నచ్చటం.. నచ్చకపోవటం తర్వాత.. సర్వీసు బాగోలేకపోయినా.. సర్వీస్ ఛార్జ్ పేరిట 5 శాతం నుంచి 20 శాతం వరకూ బాదేసే రెస్టారెంట్లకు.. హోటళ్లపైనా కేంద్రం తాజాగా క్లియర్ నిబంధనల్ని వెల్లడించింది. దీని ప్రకారం.. ఇకపై హోటళ్లు.. రెస్టారెంట్లకు వెళ్లిన వినియోగదారులు.. సర్వీసు ఛార్జ్ ఇవ్వాలా? వద్దా? అన్నది కేవలం కస్టమర్ల ఇష్టం మీదన ఆధారపడి ఉంటుందే తప్పించి.. హోటల్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా విధించే అవకాశం లేదని తేల్చేసింది.
కేంద్రం వినియోగదారుల విభాగం తాజాగా విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. ఇకపై రెస్టారెంట్లకు వెళ్లి తినే వారు.. వంటకాలు.. సర్వీస్ సంతృప్తికరంగా ఉంటే తప్పించి.. సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ.. సర్వీసు సరిగా లేని పక్షంలో.. ఆ ఛార్జ్ ను చెల్లించాల్సిన అవసరం లేదన్న ఆదేశాల్ని జారీ చేసింది. తాజా ఆదేశాల పుణ్యమా అని.. రెస్టారెంట్లు ఇకపై వినియోగదారుల వైఖరికి భిన్నంగా సర్వీస్ ట్యాక్స్ ను వసూలు చేసే అవకాశం లేదని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/