వందల కోట్ల ఆస్తులు.. లక్షలాది మంది అభిమానులు..జడ్ ప్లస్ భద్రత.. అంతకు మించిన ప్రైవేటు సైన్యం.. సగటు రాజకీయ నేత మొదలు మంత్రుల వరకూ పాదాభివందనాలు ఇలా చెప్పుకుంటూ పోతే డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ వైభోగమే వైభోగం. హర్యానా.. పంజాబ్ రాష్ట్రాల్లో తన హవా నడిపించే గుర్మిత్ పలుకబడిని నాలుగు మాటల్లోకి కుదించటం కష్టం.
అంతటి పవర్ ఫుల్ బాబా చట్టం పుణ్యమా అని ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలోని రోహతక్ జైల్లో ఉన్నాడు. తన ఆశ్రమంలో ఉండే ఇద్దరు యువతుల్ని అత్యాచారం చేసిన ఆరోపణలు కాస్తా నిజమని తేలటంతో గుర్మిత్‌కు జైలు తప్పలేదు. అంతులేని అధికారాన్ని అనుభవించే గుర్మిత్ మీద ఫిర్యాదు చేసే సాహసం లేదనే చెప్పాలి. అయితే.. పదిహేనేళ్ల క్రితం అప్పటి ప్రధాని వాజ్ పేయ్ కి ఒక బాధితురాలు రహస్య లేఖను రాసింది. అదే.. గుర్మిత్ ను ప్రస్తుతం జైలుపాలు అయ్యేలా చేసింది. అజ్ఞాత బాధితురాలు రాసిన ఒక లేఖతో డేరా చీఫ్ అకృత్యాలు బయటకు రావటమే కాదు.. చివరకు కటకటాల పాలయ్యేలా చేసింది. ఇంతకీ సదరు బాధితురాలు లేఖలోఏం రాసింది? అన్న విషయంలోకి వెళితే..
‘‘నేను పంజాబ్ నుంచి వచ్చిన ఓ యువతిని. మా పేరెంట్స్ గుర్మీత్ బాబా భక్తులు. వారి ఒత్తిడితో ఆశ్రమంలో చేరాల్సి వచ్చింది. ఒక రోజు రాత్రి 10 గంటల సమయంలో బాబా ప్రధాన భక్తురాలు గురుజోత్ నా దగ్గరకు వచ్చారు. గుఫాకు వెళ్లాలని చెప్పింది. నేను ఆ గదిలోకి వెళ్లే సరికి గుర్మీత్ టీవీలో నీలి చిత్రం చూస్తున్నాడు. తలగడ కింద రివాల్వర్ ఉంది. నన్ను చూసి ఆయన టీవీని ఆఫ్ చేశాడు. తన పక్కన కూర్చోమని ఆదేశించాడు"
"నన్ను కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంగా తనను తాను దేవుడినన్నాడు. మరి.. దేవుడు ఇలాంటి = పనులు చేస్తాడా అని అడిగా. 360 మంది గోపికలతో శృంగారం సాగించిన శ్రీకృష్ణుడ్ని దేవుడిగానే చూస్తాం కదా అన్నాడు. తన కోరిక తీర్చకపోతే రివాల్వర్‌తో కాల్చి చంపుతానని బెదిరించాడు. నా కుటుంబ సభ్యుల్ని చంపేస్తానన్నాడు. హరాన్యా, పంజాబ్ ముఖ్యమంత్రులు.. కేంద్ర మంత్రులు తన కాళ్లు మొక్కుతారన్నాడు"
"ఆపై.. నా మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. గడచిన మూడు నెలల్లో 25-30 రోజులకు ఒకసారి నా వంతు వచ్చేది. దీంతో ఇతర మహిళలపై కూడా గుర్మీత్ అత్యాచారానికి పాల్పడుతున్నాడని అర్థమైంది. డేరాలో నివసించేవారిలో 35-40 సంవత్సరాల మధ్య వయసున్న అవివాహిత మహిళలు 40 మంది వరకున్నారు. పెళ్లి వయసు దాటిపోవడం.. వారి తల్లిదండ్రులు బాబాకు మూఢ భక్తులు కావడం వల్ల వారంతా రాజీపడి బతుకుతున్నారు"
"గూపీకి వెళ్లే మేమంతా తెల్లటి దుస్తులు ధరించాలి. ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవాలి, మగవారికి 10 అడుగుల దూరంలో ఉండాలి. ఇవన్నీ గుర్మీత్ ఆదేశాలు. చూసేవారికి మేం దేవతల్లా జీవిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ మావి వ్యభిచారి బతుకులు. ఆశ్రమంలోని సాధ్విలందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తే మేం కన్యలమో కాదో తెలుస్తుంది. గుర్మీత్ అక్రమాలు వెలుగులోకి వస్తాయి. ఈ లేఖతో అయినా.. దయచేసి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఈ లేఖపై నాటి ప్రధాని వాజ్ పేయ్ విచారణకు ఆదేశించటం.. గుర్మీత్ బాబా పాపం పండి దాదాపు పదిహేనేళ్ల తర్వాత కటకటాల వెనక్కి వెళ్లారు.