ఈమధ్య కాలంలో విమానాల్లో రకరకాల వింత పనులు చేసే జనం పెరిగిపోతున్నారు. విమానం గాళ్లో ఉండగా విండో తీస్తూ బయపెట్టేవాడు ఒకడైతే.. తోటిప్రయాణికులపై అసభ్యంగా ప్రవర్తించే వాడు మరొకడు. ఇక తాగి హల్ చల్ చేసేవాడు ఇంకొకడు. ఈ సమయంలో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తులు కూడా గతంలో తెరపైకి వచ్చారు. అయితే తాజాగా వీరందరినీ తలదన్నే వింతమనిషి ఒకడు విమానంలో గలీజు పనిచేశాడు.
అవును... ముంబై నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు ఎవరూ ఊహించని పని చేశాడు. విమానంలోనే ఫుట్ పాత్ పై మల, మూత్ర విసర్జన చేశాడు. దీంతో... విమానం ఢిల్లీకి చేరుకోగానే సదరు గలీజు వ్యక్తిని ఎయిర్ పోర్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ సంఘటన జూన్ 24న ఏఐసీ 866 విమానంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... ఏఐసీ 866 విమానంలో 9వ వరుసలో సీట్ నెంబర్ 17ఎఫ్ లో ప్రయాణికుడు రామ్ సింగ్ కూర్చున్నాడు. విమానం గాళ్లో ఉండగా... సడన్ గా సీటు కింద కూర్చుని మల, మూత్ర విసర్జన చేశాడు. అతని తీరుతో తోటి ప్రయాణికులు అవాక్కవగా... క్యాబిన్ సిబ్బంది అతడిని తీవ్రంగా హెచ్చరించారు.
అనంతరం ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందికి కంప్లైంట్ చేశారు. దీంతో విమానం ఢిల్లీకి చేరుకున్న వెంటనే.. అతడిని అదుపులోకి తీసుకున్నా సెక్యూరిటీ ఫోర్స్.. 294 (అశ్లీల చర్యలు), 510 (తాగి పబ్లిక్ ని డిస్ట్రబ్ చేయడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా గతంలో కూడా ఇలాంటి మూత్ర విసర్జన సంఘటనలు చాలానే జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... న్యూయార్క్ నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి.. మహిళా ప్రయాణికురాలి పై మూత్ర విసర్జన చేశాడు.
ఇదే విధంగా... పారిస్ - న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ఒక మహిళా ప్రయాణీకురాలి దుప్పటిపై మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు. ఈ రెండు సంఘటనలూ గతేడాది నవంబర్, డిశెంబర్ నెలల్లో వరుసగా జరిగాయి.