సీఎంపై చెప్పుదాడి...స‌భ‌లో ఉద్రిక్తత‌

Update: 2018-10-11 16:20 GMT
బీహార్ సీఎం నితీష్ కుమార్‌ కు ప‌రాభ‌వం ఎదురైంది.ఓ సభలో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి సీఎంపై చెప్పు విసిరాడు.దీంతో స‌భ‌లో తీవ్రంగా గంద‌ర‌గోళం నెల‌కొంది.  ఈ ఘ‌ట‌న సంద‌ర్భంగా ఇటీవ‌లే పార్టీలో చేరిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. నితీష్ పక్కనే ఉన్నారు. సీఎం నితీష్‌ పైకి చెప్పు విసరడం ఇది రెండోసారి. 2016లోనూ పీకే రాయ్ అనే వ్యక్తి నితీష్‌ పైకి చెప్పు విసిరాడు.  చెప్పు విసిరిన వ్యక్తిని ఔరంగాబాద్‌ కు చెందిన చందన్ కుమార్‌ గా గుర్తించారు. చెప్పు విసిరిన చందన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పాట్నాలో జనతాదళ్ యునైటెడ్ యూత్ వింగ్ నిర్వహించిన సమావేశంలో నితీష్ మాట్లాడుతుండగా చంద‌న్ చెప్పు విసిరారు. సీఎం నితీష్ కుమార్‌పైకి చెప్పు విసిరిన వెంటనే జేడీయూ యూత్ కార్యకర్తలు చందన్‌పై దాడి చేశారు. సభలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి చందన్‌ ను విడిపించుకొని వెళ్లారు. కాగా, రాష్ట్రంలో రిజర్వేషన్లపై అసంతృప్తిగా ఉన్న చందన్.. ఈ చ‌ర్య‌కు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. అతనో అగ్ర కులానికి చెందిన వ్యక్తి కావడం, రిజర్వేషన్ వ్యవస్థ కారణంగా ఉద్యోగం లభించకపోవడంతో.. తన అసంతృప్తిని ఇలా తెలిపాడని వెల్ల‌డించారు. కాగా, ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
Tags:    

Similar News