మన చిన్నప్పుడు టీచర్లను చూస్తే 'ఉచ్చ పోసుకునేవాళ్లం'. వాళ్లు అలా కొట్టారు కాబట్టే నేడు ఇలా ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేవాళ్లు చాలా మంది.. చింత బరిగెలతో కొడితే వాతలు కూడా వచ్చేవి. అయినా తల్లిదండ్రులు చదువు చెప్పే ఉపాధ్యాయులను ఏమీ అనేవారు కాదు.కానీ ఇప్పుడు రోజులు మారాయి. పిల్లలపై చేయి పడితే టీచర్ల తాటతీసేస్తున్నారు. ఇలాగైతే ఎలా చదువు వస్తుందో వాళ్లకే తెలియాలి. ఇది మరీ శృతి మించిపోయి తాజాగా తక్కువ మార్కులు వేసి ఫెయిల్ చేశాడని ఓ లెక్కల మాస్టర్ ను చెట్టుకు కట్టేసి కొట్టారు విద్యార్థులు. ఈ దారుణం జార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలో ఉన్న ఓ గిరిజన రెసిడెన్షియల్ స్కూల్లో జరిగింది.
దుమ్కా జిల్లాలో ఉన్న ఓ గిరిజన రెసిడెన్షియల్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడ్డారు. ప్రాక్టికల్ పరీక్షల్లో తక్కువ మార్కులు వేసి తమను ఫెయిల్ చేశారనే కారణంతో ఒక ఉపాధ్యాయుడితో పాటు స్కూల్ క్లర్క్ ను చెట్టుకు కట్టేశారు. స్కూలు ప్రాంగణంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ (జేఏసీ) ఇటీవల 9వ తరగతి ఫలితాలను వెలువరించింది. ఈ ఫలితాల్లో దుమ్కా జిల్లాలోని గోపీకందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ కు చెందిన 11 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. మొత్తం 32 మంది విద్యార్థుల్లో 11 మందికి డీడీ గ్రేడ్ కేటాయించారు. ఈ గ్రేడ్ వచ్చిందంటే ఫెయిల్ అయిపోయినట్టే.. ఆన్ లైన్ లో ఈ ఫలితాలు చూసిన విద్యార్థులు కోపంతో ఊగిపోయారు.
మ్యాథ్స్ టీచర్ తమకు తక్కువ మార్కులు వేయడం వల్లే పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయని భావించారు. తక్కువ మార్కులు వేసినందుకు ఆ టీచర్ ను, ఆ ఫలితాలను జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ (జేఏసీ) వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసినందుకు స్కూల్ క్లర్క్ ను విద్యార్థులు చెట్టుకు కట్టేసి దాడి చేశారు.
గమ్మత్తైన విషయం ఏంటంటే? తొమ్మిదో తరగతి ఫలితాలు అధికారికంగా వెలువడ్డాయా? లేదా? అనేది తెలియదు.. విద్యార్థులు కేవలం తాము ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని దాడి చేశారా? లేక రాతపూర్వక పరీక్షల్లో ఫెయిలయ్యామని దాడి చేశారా? అనే దానిపై కూడా స్పష్టత లేదు. జేఏసీ సైట్ లో అప్ లోడ్ అయిన ఫలితాల్లో తేదీ పేర్కొనలేదు. దీంతో విద్యార్థులు రూమర్స్ ను నమ్మి ఈ దాడికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయం దుమారం రేగడంతో పోలీసులు వెంటనే పాఠశాలకు వెళ్లి దాడికి గురైన ఉపాధ్యాయుడు, క్లర్క్ గానీ స్కూల్ యాజమాన్యం ను ఆరాతీశారు. కానీ ఈ ఘటనపై ఫిర్యాదుకు వారు విముఖత చూపారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యానే వారిపై ఫిర్యాదు చేయడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి.abuse వద్దు.
Full View
Full View Full View Full View Full View