ఆ నారాయ‌ణ‌లో విద్యార్థులు కొట్టుకున్నారు

Update: 2017-11-03 11:46 GMT
కార‌ణం ఏదైనా కానీ ఇటీవ‌ల కాలంలో నారాయ‌ణ విద్యాసంస్థ‌ల‌కు సంబంధించిన కాలేజీల‌పై వార్త‌లు జోరుగా వ‌స్తున్నాయి. విద్యార్థుల్ని యంత్రాలుగా మారుస్తూ కార్పొరేట్ కాలేజీలు చేస్తున్న దారుణాల‌పై ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు చెందిన ప‌త్రిక‌లో వార్త‌లు రావ‌టం తెలిసిందే. ఇవి సంచ‌ల‌నం సృష్టించాయి. ఇదిలా ఉంటే.. నారాయ‌ణ‌లో చ‌దువుతున్న విద్యార్థులు కొంద‌రు సూసైడ్ చేసుకోవ‌టంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలాఉంటే.. నిన్న‌టికి ఇన్న నారాయ‌ణ‌కాలేజీపై ఏబీవీపీ కార్య‌క‌ర్త‌లు దాడి చేసి ఫ‌ర్నీచ‌ర్ ను ధ్వంసం చేశారు. నారాయ‌ణ విద్యాసంస్థ‌ల డీన్ కు ఆడాళ్ల పిచ్చి ఉందంటూ వైర‌ల్ అయిన ఒక ఆడియో టేప్ క‌ల‌క‌లం రేపింది.

డ‌బ్బులిచ్చి  డీన్‌ కు వ్య‌తిరేకంగా మ‌హిళ చేత మాట్లాడించిన‌ట్లుగా  ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా హైద‌రాబాద్ లోని వ‌న‌స్థ‌లిపురం నారాయ‌ణ విద్యాసంస్థ‌ల్లోని విద్యార్థుల మ‌ధ్య త‌న్నులాట సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

గ్యాంగ్ వార్ టైపులో సాగిన ఈ పోరులో నారాయ‌ణ విద్యార్థి పై దాడి జ‌రిగిన‌ట్లుగా  చెబుతున్నారు.

మ‌ల్లికార్జున్ అనే విద్యార్థిని బ‌య‌ట వ్య‌క్తుల‌తో తోటి విద్యార్థులే కొట్టించిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో మ‌ల్లికార్జున్ త‌ల‌పై రాళ్ల దాడి చేయ‌టం తీవ్ర గాయ‌మైన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో స‌ద‌రు విద్యార్థిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఉదంతంలో ఆరుగురిపై పోలీసులు కేసు న‌మోదు చేసిన‌ట్లుగా స‌మాచారం.  నిక్ నేమ్ తో పిలుచుకునే విష‌యంపై త‌లెత్తిన వివాదం పెద్ద‌దై.. కొట్లాట వ‌ర‌కూ వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. కార‌ణం ఏదైనా.. ఏదో ఒక అంశంపై నారాయ‌ణ కాలేజీ పేరు తెర మీద‌కు వ‌స్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News