న్యూ ఇయ‌ర్ రోజు..బాలిక‌ను ఏడిపించిన హ‌రీశ్‌

Update: 2018-01-01 13:48 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు - రాష్ట్ర భారీనీటిపారుద‌ల - శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు డైన‌మిజం గురించి  ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న ఎంత మాస్ లీడ‌ర్ అనే విష‌యంలో టీఆర్ ఎస్ పార్టీ వారికే కాకుండా...రాష్ట్రంలోని ప్ర‌తిపక్షాలకు కూడా తెలుసు. అయితే అలాంటి రాజ‌కీయ చాణ్య‌కుడిలోని సునిశిత హృద‌యం వెలుగులోకి వ‌చ్చిన సంద‌ర్భం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ఒకవైపు ప్రపంచం అంతటా కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతుంటే మరోవైపు ఒక పాప మాత్రం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో ఫోటో దిగడానికి ఎన్నో ఏళ్ల‌ నుంచి ఎదురుచూస్తోంది. ఇలాంటి తరుణంలో ఏకంగా ఆ మంత్రే స్వయంగా ఆ పాప చదువుతున్న బడికి వెళ్తే ఎలా ఉంటుంది. దేవుడే దిగొచ్చి వరమిచ్చినట్లు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లాకు చెందిన నారయణ్‌ ఖేడ్‌ కు చెందిన దివ్య అనే విద్యార్థిని సిద్దిపేట అర్బన్ మండలం ఎన్‌ సాన్‌ పల్లి గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. ఆ పాప ఎప్పటి నుండో మంత్రి హరీష్ తో ఫోటో దిగాలని ఎదురుచూస్తూ కలలు కంటూ ఉండేదట. అయితే సడెన్‌గా మంత్రి హ‌రీశ్‌ రావు న్యూ ఇయర్ వేడుకలకు రావడంతో ఆ పాప.. `సార్ తో పోటో దిగాలన్నది తన కోరిక అని ..ఎప్పుడు నెరవేరలేదు`..అంటూ ఎంతో ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకుందట. దీనికి స్పందించిన మంత్రి హరీష్ రావు తాను కూర్చున్న సీట్లోంచి లేని ఆ  విద్యార్థిని వద్దకు పోయి - అక్కున చేర్చుకుని కన్నీళ్లను తుడిచి విద్యార్థిని ఓదార్చారు.

అంతేకాదు... `నేను ఉన్న` అంటూ..ధైర్యం చెప్పి ఆమెతో మంత్రి హ‌రీశ్ రావు పోటో దిగారు. దీంతో దివ్య సంతోషపడింది. అక్క‌డే ఉన్న‌వారు ఈ ఫోట‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో యమ చక్కర్లు కొడుతుంది.
Tags:    

Similar News