ప్రపంచమంతా కరోనా మహమ్మారి దెబ్బకు చిన్నా భిన్నం అయ్యింది. వివిధ కార్యాలయాలు, పాఠశాలలు, nకళాశాలలు మూతపడ్డాయి. పిల్లా పెద్దా ఇళ్లకే పరిమితం అయ్యారు. విద్యార్థుల చదువు అటకెక్కింది.కొన్ని పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఉపాధ్యాయులు నేరుగా క్లాస్‌రూంలో ఉండి చెబితేనే విద్యార్థులు చదవడం, చదివిన దాన్ని బుర్రకెక్కించుకోవం కష్టం. ఇక ఆన్లైన్ క్లాస్‌లో వాళ్లు ఏం వింటున్నారో.. ఏం నేర్చుకుంటున్నారో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ కరోనా ఎప్పటికి పోతుందో.. క్లాసులు ఎప్పుడు ప్రారంభవుతాయోనని ఆందోళన చెందుతున్నారు పేరెంట్స్. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన ఓ పాఠశాల వినూత్నంగా ఆలోచించింది. కరోనా మహమ్మారి విజృంభించిన ప్రస్తుత తరుణంలోనూ ఎలాగైనా పిల్లలను పాఠశాలకు రప్పించాలని ఆలోచించింది. అందుకనుగుణంగా తరగతి గది రూపు రేఖలను పూర్తిగా మార్చివేసింది.
ప్రతి విద్యార్థి కరోనా నుంచి రక్షణ పొందేలా ఓ గుడారాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా వ్యాధి ఒక విద్యార్థి నుంచి మరో విద్యార్థికి వ్యాధి సంక్రమించకుండా ఏర్పాట్లు చేసింది. ఒక విద్యార్థికి మరో విద్యార్థికి నిర్ణీత దూరంతో ఏర్పాటుచేయడంతోపాటు.. పిల్లలకు ఒక్కొక్కరికీ ప్రత్యేకంగా క్యాబిన్లను ఏర్పాటు చేసింది. ఈ ఆలోచన ఎంతవరకూ సక్సెస్ అవుతుందో వేచిచూడాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు అయితే సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. చూసిన వారంతా ఐడియా భలేగా ఉందని అంటున్నారు.