‘మత్తు’ వదలరా రిపీట్.. విద్యార్థుల డేంజర్ గేమ్

Update: 2020-02-15 22:30 GMT
అదొక కెమికల్ గమ్.. దీనిని ఎలక్ట్రికల్ వస్తువుల మరమ్మత్తులు, వస్తువులను అతికించడంలో వాడుతుంటారు. అయితే కొందరు విద్యార్థులు మాత్రం ఈ కెమికల్ గమ్మును మత్తు మందుగా వాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చిన్నతనంలో మత్తుకు అలవాటుపడి జీవితాన్ని నాశనం చూసుకుంటున్నారు. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట లో కొందరు విద్యార్థులు మాక్సోబాండ్ కెమికల్ గమ్ ను మత్తుమందు ఉపయోగిస్తూ బానిసలయ్యారు. మాక్సోబాండ్ గమ్ డ్రగ్స్ మాదిరి గా వాడుతుండగా గమనించిన తల్లిదండ్రులు వారిని మందలించారు. విద్యార్థులకు వైద్యుడి వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించ గా అసలు విషయం బయట పడింది. మత్తు వదలరా సినిమాలో ఇటీవల కొత్త మత్తు కోసం ప్రయత్నించినట్టు సినిమా చూసి వీరు ఇన్ స్పిరేషన్ అయ్యి ఇలా ఈ గమ్ మత్తుకు బానిసలయ్యారని తెలిసింది..

మాక్సోబాండ్ కెమికల్ గమ్ 18ఏళ్లలోపువారికి అమ్మకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ విద్యార్థులకు ఎలా లభించాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయం పోలీసులకు తెలియడం తో ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. జనగామకు చెందిన ఓ బాలుడు వర్ధన్నపేటలోని బంధువుల ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు. మత్తు వదలరా సినిమాను చూసి ఇన్ స్పిరేషన్ అయిన ఆ బాలుడు ఈ ప్రాంతంలోని విద్యార్థులకు మాక్సోబాండ్ కెమికల్ గమ్ ను మత్తు మందుగా ఎలా వాడాలో చూపించాడు. దీంతో విద్యార్థులు మాక్సోబాండ్ వాసనకు అలవాటు పడి కొంత కాలంగా దీనికి బానిసైనట్లు తెలుస్తోంది. అయితే సదరు విద్యార్థులు గుంపుగా చేరి మాక్సోబాండ్ ను మత్తుమందుగా వాడుతుండగా ఓ విద్యార్థి తల్లి గమనించి నిలదీసింది. దీంతో విద్యార్థి అసలు విషయం బయట పెట్టాడు. దీంతో అవాక్కయిన ఆమె వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా విద్యార్థులు మత్తుకు బానిసలయ్యారనే విషయం బయటపడింది.

ఈ విషయాన్ని సిరియస్ గా తీసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థులు చదివే పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. పాఠశాల ఆవరణంలో మాక్సోబాండ్ ప్యాకెట్లు కుప్పలు తెప్పలుగా కన్పించాయి. దీంతో సదరు విద్యార్థులను పోలీసులు ప్రశ్నించారు. ఓ ఎలక్ట్రికల్ షాపులో మాక్సోబాండ్ కొనుగోలు చేసినట్లు చేపట్టారు. సదరు షాపు యాజమానిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులు చేసే పనులను గమనించకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు విద్యార్థుల చదువులతోపాటు వారు సరైన మార్గంలో నడుస్తున్నారా? లేదా అని గమనించాలని పలువురు సూచిస్తున్నారు.


Tags:    

Similar News