మోడీ గాలి తీసేసిన సుబ్రమణ్యస్వామి!

Update: 2023-06-06 18:32 GMT
సంచలన వ్యాఖ్యలు చేయడం లో.. వివాదస్పదంగా అనిపించే ట్వీట్లు చేయడం లో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి లెక్కే వేరు! తాను మాట్లాడాలనుకున్న విషయం సూటి గా మాట్లాడటం.. తాను చెప్పాలనుకున్న విషయం కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఈయన స్టైల్ అని ఆయన ఫ్యాన్స్ అంటుంటారు. తన సొంత పార్టీ బీజేపీ పైన ఇప్పటికే ఎన్నో సంచలన కామెంట్లు చేసిన ఆయన తాజాగా భారతదేశ ప్రస్తుత ఆర్థిక గణాంకాల పై సీరియస్ నోట్ ఇచ్చారు!

"భారత్ వెలిగిపోతోంది"... ఒకప్పుడు బీజేపీ నినాదం. 2004లో వాజపేయి నేతృత్వంలో బీజేపీ ముందస్తు ఎన్నికలు కు వెళ్లి దెబ్బతిన్న సమయంలో బాగా ఫేమస్ అయిన నినాదం ఇది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి కి ముందస్తుకు వెళ్లడం ఓ కారణమైతే, "భారత్ వెలిగిపోతోంది" అనేది రెండో కారణమని వాజ్ పేయి ఒప్పుకున్న పరిస్థితి. అంటే ప్రజల కు అన్నీ తెలుసు... మసిపూసి మారెడుకాయ చేద్దామని ప్రభుత్వాలు భావిస్తే... సానుకూల ఫలితాలు రావు అన్నమాట.

ఈ ఊదేశ్యం తోనే మోడీ సర్కార్ ని అలర్ట్ చేస్తూ చెప్పారో.. లేక, తన సహజ శైలి లో భాగంగా చెప్పారో తెలియదు కానీ... తాజాగా జీడీపీ పై కీలక వ్యాఖ్యలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి! అవును... కరోనా రికవరీ రేటు నుంచి జీడీపీ వృద్ధి రేటు ను తీసివేస్తే వృద్ధి కేవలం 4 శాతమేన ని ట్విట్టర్ వేధిక గా వెల్లడించారు సుబ్రహమణ్య స్వామి! ఈ సందర్భంగా ఈ రేటు నెహ్రూ కాలం లో సాధించినదని వెల్లడించడం గమనార్హం! మోడీ హయాం లో భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుందని బీజేపీ నేతలు చెబుతున్న సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం!

ఇక, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం లో భారత జిడీపీ 6.1 శాతం చొప్పున వృద్ధి చెందిందనట్లు తాజాగా గణాంకాలు విడుదలయ్యాయి. ఇదే క్రమంలో... వార్షిక జీడీపీ వృద్ధి రేటు ను తాజాగా 7.2 శాతానికి పెంచింది ప్రభుత్వం. దీంతో ఈ విషయాల పై స్పందించిన సుబ్రహ్మణ్య స్వామి... తాను భారతదేశ ఆర్థిక గణాంకాల ను క్షుణ్ణంగా విశ్లేషించించానని చెబుతూ... భారత ఆర్థిక వ్యవస్థ మెరుస్తోందనే చర్చలన్నీ నిరాధారమైనవని సంచలన వ్యాఖ్యలు చేశారు!

కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పై గతం లో అనేక విమర్శలు చేసిన సుబ్రహ్మణ్య స్వామి... తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా స్పందించిన ఆయన... తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక బోగస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ లో వ్యవసాయం, పరిశ్రమల కు ప్రాధాన్యతే లేదని.. ప్రభుత్వాని కి ఏ రకమైన వ్యూహం లేదని బడ్జెట్‌ లో స్పష్టంగా తెలుస్తోందని దుయ్యబట్టారు!

Similar News