సునంద కేసులో సాక్ష్యాలు లేపేశారు

Update: 2017-07-22 17:39 GMT
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కాంగ్రెస్ నేత - మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ కేసు మ‌లుపులు తిరుగుతోంది. ఈ కేసు విచార‌ణ సాగుతున్న తీరుపై బీజేపీకి చెందిన సీనియ‌ర్ నేత సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కేసు విచార‌ణ స‌రైన రీతిలో జ‌ర‌గ‌డం లేద‌ని ఆరోపించారు. కేసు విచార‌ణ‌లో అధికారులు ప‌క్క‌దోవ ప‌ట్టించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, దీంతోపాటుగా సునంద భ‌ర్త శ‌శిథ‌రూర్ అబ‌ద్దాలు చెప్పార‌ని సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి విమ‌ర్శించారు.

తాజాగా ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందిన కేసును ప‌రిష్క‌రించేందుకు మూడేళ్ల స‌మ‌యం కావాలా అని సుబ్రహ్మ‌ణ్య‌స్వామి నిల‌దీశారు. పోలీసుల సాగ‌దీత కార్య‌క్ర‌మం వ‌ల్ల కేసు నీరుగారిపోతోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే అనేక సాక్ష్యాలు నాశ‌నం అయ్యాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కేసు విచార‌ణ‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు సీనియ‌ర్ అధికారి నేతృత్వంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేయాల‌ని సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కోరారు. వీట‌న్నింటికంటే సీబీఐ విచార‌ణ స‌రైన‌ద‌ని సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి అన్నారు.

ఇదిలాఉండ‌గా...తన భార్య సునందా పుష్కర్ హత్య కేసులో తనను ఇరికించే కుట్ర జరుగుతోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గ‌తంలో ఆరోపించారు. సునంద మరణంపై ఢిల్లీ పోలీస్ కమీషనర్ బీఎస్ బస్సి కి థరూర్ రాసిన లేఖ‌లో ఈ విష‌యాలు వెల్ల‌డించారు. హత్య చేసింది తామేనని ఢిల్లీ పోలీసులు తన ఇంట్లో ఉండే పనిమనిషి నారాయణ్ సింగ్ ని హింసిస్తున్నారని లెటర్ లో ప్రస్తావించారు. ఈ కేసు విచారణ‌కు తానూ, తన సిబ్బంది పోలీసులకు సహకరిస్తూనే ఉన్నామని, నవంబర్ నెలలో ఓ సారి నారాయణ్ ను మొత్తం 30 గంటలు విచారించారని చెప్పారు. విచారణ టైమ్ ఆయనను తీవ్రంగా హింసించిన పోలీస్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవాలని శశి థరూర్ పోలీస్ కమీషనర్ ని డిమాండ్ చేశారు.
Tags:    

Similar News