ఎవరైనా ఏదైనా కొత్త పని చేస్తానని ప్రకటించినప్పుడు కాస్త వెయిట్ చేయటం సంస్కారం. కానీ.. అలాంటి పరిస్థితి నేటి దూకుడు రాజకీయాల్లో అస్సలు కనిపించవు. ఎంతసేపటికి.. ఎంత ఘాటుగా.. ఎంత వివాదాస్పదంగా మాట్లాడితే అంత మైలేజ్ అన్నట్లుగా మారిపోయింది.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి వస్తానని అధికారికంగా ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఘాటు విమర్శను ఎదుర్కొన్నారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ సుబ్రమణ్య స్వామి తాజాగా రజనీ పొలిటికల్ ఎంట్రీ మీద స్పందించారు. రజనీ రాజకీయ ప్రకటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రజనీ చదువు సంధ్యా లేని వ్యక్తి అని.. అతను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏం చెబుతారని విమర్శించారు. నటులు రాజకీయాల్లోకి రావటం తమిళనాడుకు కొత్తేమీ కాదని.. పాత కథేనని చెప్పారు. మొదటి నుంచి తాను రజనీకాంత్ ను వ్యతిరేకిస్తూనే ఉన్నానని చెప్పారు. తమిళ రాజకీయాల నుంచి నటులను వెలేసినప్పుడే తమిళనాడు ప్రతిష్ఠ పెరుగుతుందన్నారు.
రజనీకాంత్ ఒక నిరక్షరాస్యుడని.. రజనీ సమక్షంలో మీడియా హడావుడి తప్ప మరేమీ లేదని తేల్చేసిన స్వామి.. ఇప్పటికి రజనీ తన పార్టీ పేరేంతో ప్రకటించలేదన్నారు. తమిళనాడు ప్రజలు తెలివైనవారిగా పేర్కొన్న సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలపై రజనీ అభిమానులు మండిపడుతున్నారు. చదువుకున్న వాళ్లు మాత్రమే రాజకీయాలు చేయాలన్న స్వామి థియరీని తప్పు పడుతున్నారు. అదే నిజమైతే.. స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీలో అందరూ చదువుకున్న వారే ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు.