ప్ర‌కాష్ రాజ్ కు స్వామి షాక్..వీడియో వైర‌ల్!

Update: 2018-05-07 11:55 GMT
బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య స్వామి....విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్...వాగ్ధాటిలో...కుండ‌బ‌ద్ద‌లుకొట్ట‌నట్లు మాట్లాడ‌డంలో వీరిద్ద‌రూ ఒక‌రికి మించిన వారు మ‌రొక‌రు. త‌న మ‌న భేదం లేకుండా సొంత పార్టీవారిని కూడా విమ‌ర్శించ‌డానికి స్వామి వెనుకాడ‌రన్న సంగ‌తి తెలిసిందే. మోదీ, బీజేపీల‌పై సంద‌ర్భానుసారంగా ప్ర‌కాష్ రాజ్ సూటిగా ప‌దునైన విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్నారు. అటువంటి ఈ ఇద్ద‌రు విల‌క్ష‌ణ వ్య‌క్తులో తాజాగా జ‌రిగిన ఓ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో ఎదురుప‌డ్డారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఓ లైవ్ డిస్క‌ష‌న్ కార్య‌క్ర‌మంలో స్వామి, ప్ర‌కాష్ రాజ్ లు పాల్గొన్నారు. ఈ కార్య‌క్రం సంద‌ర్భంగా ప్రకాష్ రాజ్ ను ఇరుకున పెట్టే విధంగా....ఆయన దూకుడుకు క‌ళ్లెం వేసే విధంగా స్వామి కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. వాటికి స‌మాధానాలు చెప్పేందుకు ప్ర‌కాష్ రాజ్ కొద్దిగా త‌డ‌బ‌డ్డారు. తాజాగా, వీరిద్ద‌రి సంభాష‌ణ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

భార‌త్ ను హిందూ దేశంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంద‌ని, వివిధ ముస్లిం దేశాల‌లో హిందువుల‌ను వెళ్లగొడితే పరిస్థితి ఏమిట‌ని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఈ దేశం నుంచి ముస్లింలు.. ఇతర మత‌స్థుల‌ను వెళ్లిపోవాలని ఎవరంటున్నారని స్వామి ఎదురు ప్రశ్నించారు. ఈ దేశంలో హిందువులకే సరైన రక్షణ లేదని, త‌మపై వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా వారంతా సంఘటితం కావాలని కోరామ‌ని చెప్పారు. ఆ మాట‌కొస్తే భార‌త్ లో ముస్లింలు, ఇతర మతాల వారున్నంత ప్ర‌శాంతంగా పాకిస్థాన్‌, గల్ఫ్ దేశాల్లో హిందువులు ఉంటున్నారా అని స్వామి ప్రశ్నించారు. ముస్లిం దేశాల్లో హిందూ గుడి కట్టే అవకాశం లేద‌ని అన్నారు. దేశంలో 47 వేల దేవాలయాల్ని ముస్లిం రాజులు ధ్వంసం చేసిన అంశాన్ని మీలాంటి సూడో సెక్యులరిస్టులు ప్రశ్నించరని స్వామి అన్నారు. స్వామి మాట‌ల‌దాడికి ప్రకాష్ రాజ్ సమాధానం చెప్పలేక ఇబ్బందిప‌డ్డారు. ఆ సంద‌ర్భంలో ఆడిటోరయం చప్పట్లతో మార్మోగిపోయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News