బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తన పర అనే బేధం లేకుండా తప్పుడు ఎక్కడ జరిగినా కడిగిపారేస్తుంటాడు. సొంత బీజేపీ విధానాలను కూడా ఆయన ఎండగడుతుంటారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుపొందాడు.
ఇప్పటికే కేంద్రంలోని సొంత బీజేపీ సర్కార్ ను ఇరుకునపెట్టేలా బీజేపీ సీనియర్ ఎంపీ ఇటీవల సూటి ప్రశ్నలు వేశారు. కరోనా మూలాలపై చైనాను అమెరికా ప్రశ్నిస్తున్నా.. భారత్ మాత్రం సైలెంట్ గా ఉండటంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక అప్పట్లో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలోనూ మోడీని సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు. దుబాయ్ లో చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతున్న కొందరు డాన్ లతో ముంబై సెలెబ్రెటీలకు లింక్ ఉందని.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తును వారు కప్పిపుచ్చుతూ సుశాంత్ ది ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని.. దీనివెనుక బడాబాబులున్నారని.. సీబీఐ విచారణ జరిపించాలని మోడీకి సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు.అదప్పుడు సంచలనమైంది.
తాజాగా పక్కదేశమైన బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఖండించడం లేదని రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
చైనా లఢక్ ను ఆక్రమించడానికి వచ్చినప్పుడు దూకుడు ప్రదర్శించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తుందో చెప్పాలన్నారు. అప్ఘన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నారన్నారు.
బంగ్లాదేశ్ మరో అప్ఘన్ కాకముందే భారత ప్రభుత్వం స్పందించి బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువుల హక్కులను కాపాడాలన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సొంత పార్టీ ఎంపీ కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.