ఏ మాటకు ఆ మాటే మోడీని మెచ్చుకోవాలి. నడ్డి విరిచే పన్నులేసే నిర్ణయాల్ని జనాలకు నొప్పి తెలీకుండా తీసుకోవటంలో ఆయనకు ఆయనే సాటి. స్వతంత్ర్య భారతంలో ఎవరూ చేయలేని విధంగా జనాల్ని మోటివేట్ చేస్తున్నట్లే చేసి.. వారి మీద భారం మోపటం ఆయనే చెల్లింది. పరిసరాల పరిశుభ్రత పేరిట స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టి.. ప్రధాని హోదాలో మూడు నాలుగుసార్లు చీపురుపట్టి.. దేశం మొత్తాన్ని కదిలించి.. వారిలో పరిశుభ్రత వైపు చైతన్యం పెంచిన ఆయన పనిలో పనిగా స్వచ్ఛభారత్ పేరిట సెస్సును వసూళ్లు మొదలెట్టారు. మన పరిసరాల పరిశుభ్రత కోసం ఆ మాత్రం పన్ను కడితే ఏమవుతుందిలే అన్నభావనను జనాల్లో పెంచేసి వారి ముక్కు పిండి వసూలు చేస్తున్నమొత్తంతో భారతావని ఎంత స్వచ్ఛంగా తయారైందన్నది పెద్ద ప్రశ్న. ఇలాంటివి అడిగేవాడు ఉండదు.. సమాధానం చెప్పే వాడూ ఉండదు.
ఇదొక్కటే కాదు.. మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతి జీవి సబ్సిడీ మీద నేరుగా ప్రతిఫలం పొందే గ్యాస్ బండ విషయంలోనూ.. ‘దేశ పౌరుడిగా మన బాధ్యత’ అన్న భావనను కలిగించి.. గ్యాస్ బండ మీద ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఎవరికి వారే వదులుకునేలా చేయటంలో మోడీకే సాధ్యమవుతుంది. జనాల దగ్గర ఇన్నేసి లాగేసుకుంటున్న ఆయన.. తమ మంత్రులకు.. ఎంపీలకు ఇచ్చే వసతుల్లో ఏమైనా కోత పెట్టారా? ప్రభుత్వ దుబారాను కంట్రోల్ చేసేందుకు ఏమైనా కార్యక్రమాన్ని చేపట్టారా? అంటే డౌటే.
తాజాగా ఈ తరహాలోనే మరో కార్యక్రమాన్ని షురూ చేశారు. కాకుంటే దీనికి సంబంధించిన ప్రచారం ఇంకా షురూ కాలేదు. ప్రజలకు సబ్సిడీ రూపంలో ఇస్తున్న రూ.34వేల కోట్లలో వీలైనంత మొత్తాన్ని వెనక్కి లాగేసుకునేందుకు వీలుగా మోడీ సర్కారు ఒక ప్లాన్ సిద్దం చేసింది. రైల్వే ఛార్జీల్లో ప్రభుత్వం భరిస్తున్న రాయితీ భారాన్ని ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించింది. ప్రతి ఏటా ప్రయాణికుడి రైలు ప్రయాణంలో అయ్యే ఖర్చులో కేవలం టికెట్ రూపంలో 57 శాతాన్ని మాత్రమే వసూలుచేస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తుంది.
దీని వల్ల ఏడాదికేడాది భారం పెరిగిపోతుందని.. అందుకే ఆ భారాన్ని తెలివిగా ప్రయాణికుల మీదకు మళ్లించేందుకు వీలుగా టికెట్ మీద వారికిచ్చే సబ్సిడీ మొత్తాన్ని తెలియజేయనున్నారు. సామాజిక స్పృహను తట్టి లేపుతూ.. అంతేసి మొత్తాన్ని తమ కారణంగా ప్రభుత్వానికి భారం పడుతుందన్న వాదనను ప్రచారం చేసి.. ఆ భారం వదులుకోవటం ద్వారా.. పేదవాడికి మరింత సంక్షేమాన్ని అందించొచ్చు అంటూ ఇస్తున్న రాయితీలకు మంగళం పాడే ప్రోగ్రాంను షురూ చేయనున్నారు. ప్రయాణికుల టికెట్ల మీద ఏటా కలుగుతున్న రూ.34వేల కోట్లలో వీలైనంత మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవటమే లక్ష్యంగా కదుపుతున్న పావులు దేశ ప్రజల మీద ఎంతమేర ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి.