పవన్ కల్యాణ్ అంటే బీజేపీ నేతలు ఉడికి పోతున్నారు. నిన్నటి వరుకు ఇద్దరు మిత్రుల్లా ఉన్న వీరిద్దరు ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జేఎఫ్ సీ - తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే సభల్లో పూనకంతో ఊగిపోతూ మాట్లాడి సైలెంట్ అయిపోవడం కాదని..భవిష్యత్తు కార్యచరణ ఏంటో ప్రకటించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై పవన్ ఏర్పాటు చేసిన జేఎఫ్ సీ వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా..ఉంటే ప్రయోజనాలేంటో ప్రజలకు చెప్పాలని బీజేపీ నేత సుధీష్ రాంభట్ల మండిపడ్డారు.
అర్ధం పర్ధం లేకుండా పీఎం మోడీపై ద్వజమెత్తితే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్రం ఏపీకి చేసిన సాయం మరే రాష్ట్రానికి చేయలేదని గుర్తు చేశారు.
అంతేకాదు జేఎఫ్ సీలో మాట్లాడే పెద్దలు ఒకరు ఒకలా మరొకరు మరోలా మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీ నేతలు సైతం కేంద్రం ఇచ్చిన ప్రతీపైసాకు లెక్కచెప్పాలని - లేదంటే బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఏపీ అభివృద్దికి కట్టుబడి ఉన్న బీజేపీ పదేళ్ల కంటే ముందుగా రాష్ట్రానికి కావాల్సిన విద్యాసంస్థల్ని కేటాయించిందని చెప్పారు. అన్ని సక్రమంగా ఉన్న భోగాపురం విమానాశ్రయం టెండర్ ను రద్దు చేసిన చంద్రబాబు ..తాము చెప్పిన లెక్కలు తప్పని తేలితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.