బ్యాంకులకు కొన్ని వందల కోట్ల రూపాయల మొత్తాన్ని నష్టం కలిగించారనే అభియోగాలతో తనకు సీబీఐ నుంచి నోటీసులు జారీ అయిన విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి ధ్రువీకరించారు. అయితే ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టుగా తనకూ ఆ వ్యవహారానికి ఏ మాత్రం సంబంధం లేదని చౌదరి ప్రకటించారు.
బెస్ట్ అండ్ క్రాంప్టన్ అనే ఆ కంపెనీతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని, ఆ కంపెనీ గురించి తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు చౌదరి తరఫు నుంచి ఒక ప్రెస్ నోట్ విడుదల అయ్యింది.
సుజనా గ్రూప్ లో లిస్టెడ్ అయిన పలు కంపెనీల్లో తను నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో మాత్రమే కొనసాగినట్టుగా, ఆ కంపెనీలపై దాఖలైన అభియోగాలకు తను బాధ్యత వహించాల్సిన అవసరం లేదని చౌదరి పేర్కొన్నారు.
2014 వరకూ సదరు సంస్థల్లో తను ఎలాంటి యాజమాన్య బాధ్యతలూ చేపట్టనట్టుగా వివరించారు. సీబీఐ తనపై అభియోగాలు మోపుతూ నోటీసులు ఏ మాత్రం విలువ లేనివిగా, సదరు కంపెనీకూ తనకూ ఏ మాత్రం సంబంధం లేదని చౌదరి స్పష్టం చేశారు. మీడియాకు అయితే ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఇక సీబీఐకి ఏమని వివరణ ఇస్తారో చూడాల్సి ఉంది!