ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ పోరాటాల సరళి ఏమిటో అర్థం కావడం లేదు. ఒకవైపు ఆ పార్టీ సభ్యులు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరో వైపు ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు - కేంద్రమంత్రి సుజనా చౌదరి మాత్రం భాజపా మంత్రులతో మంతనాలు సాగిస్తున్నారు. నిన్నటిదాకా విభజన హామీల సంగతి - నిధుల సంగతి స్పష్టతతో తేల్చేదాకా మడమ తిప్పేది లేదని తెలుగుదేశం ఎంపీలు నినదించిన సంగతి తెలిసిందే. కానీ సుజనా మాటల్లో మెత్తబడిపోతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇంతకూ ఆయన రాజ్యసభ సాక్షిగా ఏం చెబుతున్నారో తెలుసా..? కేవలం రెండు గంటల చర్చకు అనుమతిస్తే చాలునట. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రెండు వారాల గడువులోగా.. ఈ సమస్య గురించి విభజన హామీల గురించి ప్రకటన చేయాలని కోరారు. తేలిస్తే తప్ప ఊరుకోం అన్న వారు కాస్తా.. రెండు వారాల గడువు తీసుకోండి.. అంటూ మెత్తబడిపోవడం వెనుక మతలబు ఏంటో సామాన్యుడికి మాత్రం అర్థం కావడం లేదు. రెండు వారాల్లోగా ఆర్థిక మంత్రి స్పందించకపోయినా కూడా సుజనా పట్టించుకునేలా కనిపించడం లేదు. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఆయనే ఇచ్చేస్తున్నారు. ఎలాగంటే.. రెండు వారాల్లోగా కుదరకుంటే గనుక.. పార్లమెటు తదుపరి సమావేశాల్లో అయినా ఆర్థిక మంత్రి స్పందించాలని ఆయన కోరుతున్నారు. కేంద్రానికి ఇన్ని సదవకాశాలు సుజనా చౌదరి ఎందుకు ప్రశ్నిస్తున్నారో అర్థం కావడం లేదని తెలుగుదేశం నాయకులే తలలు పట్టుకుంటున్నారు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే ఒక మారు సభలోనే విభజన హామీలు - ప్యాకేజీ - పోలవరం - బడ్జెట్ గురించి ... ఏపీ సభ్యుల ఆందోళన గురించి ప్రకటన చేయడం జరిగింది.
వీసమెత్తు స్పష్టత లేకుండా.. కొన్ని సంవత్సరాలుగా చెబుతున్న పాచిపోయిన మాటలనే ఆయన సభలో మళ్లీ వడ్డించారు. అన్నీ మేం చూసుకుంటాం. మేం ఇస్తాం.. ప్యాకేజీ నిధులిస్తాం.. ఏపీకి చరిత్రలో ఎన్నడూ లేనన్ని నిధులు ఈసారి మాత్రమే ఇచ్చాం .. లాంటి ఉబుసుపోని ప్రకటనలెన్నో చేశారు. అయితే ఇప్పుడు జరిగిన అన్యాయం సంగతి గానీ.. ఇక ఇవ్వబోయే వాటి గురించి గానీ, వాటికి డెడ్ లైన్ ల గురించి గానీ ఆయన పెదవి విప్పలేదు.
ఇలాంటి నేపథ్యంలో జైట్లీకి కొత్తగా సుజనా గడువు ఇవ్వడం ఎందుకో.. ఇప్పటిదాకా పూర్తి కాని ఏ కసరత్తు చేసి సమాధానం చెప్పడానికి గడువు ఇస్తున్నారో.. ఆ పేరిట కొత్త నాటకానికి ఎందుకు తెరతీస్తున్నారో జనానికి తెలియడం లేదు. సుజనా తన ప్రసంగానికి ముందు అమిత్ షా తో భేటీ అయ్యారు. అక్కడ ఏమైనా మతలబు చోటుచేసుకుందా అనే అనుమానాలు కూడా వ్యాపిస్తున్నాయి.