ఏపీ అధికార పక్ష నేతలు కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. తాజాగా మొదలైన పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా.. సభలో మాట్లాడే అవకాశం వచ్చిన తెలుగుదేశం నేతలు ఏపీ విభజన చేసిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపుడుతున్నారు. మొన్నటికి మొన్నశ్రీకాకుళం ఎంపీ విభజన జరిగిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడితే.. తాజాగా కేంద్రమంత్రి సుజనా చౌదరి చేరారు.
ఏపీ విభజన సరిగా జరగలేదని చెప్పిన ఆయన.. పార్లమెంటులో రాష్ట్ర విభజన జరిగిన తీరు ఏపీలోని ప్రతిఒక్కరి మనసును కలిచి వేసిందని వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయాలు జరిగితే ఆలాంటి సమయంలో రాజ్యాంగాన్ని కాల్చేయాలని అంబేడ్కర్ చెప్పిన విషయాన్ని ప్రస్తావంచారు. తానీ మాటలు అంబేడ్కర్ మీద గౌరవంతో చెబుతున్నానని చెప్పారు. ఏపీ విభజన అప్రజాస్వామికంగా.. అసంబద్ధంగా జరిగిందని వాపోయారు. ఏపీ విభజన గురించి ఇన్ని మాటలు చెబుతున్న కేంద్రమంత్రి సుజనా చౌదరికి.. విభజన బిల్లును ఆమోదించే క్రమంలో నాటి ప్రధాని మన్మోహన్ చెప్పిన ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రస్తావించటం లేదు. ఈ మధ్యన ఏపీ అధికారపక్ష నేతలంతా ఏపీ విభజన జరిగిన తీరును ప్రస్తావిస్తూ.. ఆవేదన.. ఆందోళనతో వ్యాఖ్యలు చేస్తున్న వారు.. ఏపీకి ప్రత్యేక హో దా అంశంపై కేంద్రం తీరును ఎందుకు ప్రశ్నించటం లేదు..?