పార్టీ పరమైన ప్రయోజనాల విషయంలో తెగ ఆసక్తి ప్రదర్శించే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి మరో మారు అదే ఉత్సుకతను చూపారు. అదికూడా ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వద్ద కావడం ఆసక్తికరం. అయితే సుజనా ప్రతిపాదనకు అమిత్ షా `నో` చెప్పకుండానే దాటవేసే సమాధానం ఇవ్వడం గమనార్హం. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో అమిత్ షాను కలిసిన సుజనా చౌదరి రెండు శాసనసభ సీట్లను వీలున్నంత త్వరగా పెంచాలని కోరారు. అయితే దీనిపై ఖచ్చితమైన హామీ ఇవ్వని అమిత్ షా....ప్రధానితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని షా తెలిపినట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలోనే బిల్లును పార్లమెంటులో ప్రతిపాదిస్తే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెంచిన సీట్లతో ఎన్నికలు జరిపేందుకు వీలుంటుందని అమిత్ షాతో సుజనా చౌదరి వాదించినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసన సభల సంఖ్యను వీలున్నంత త్వరగా పెంచాలని, బిల్లును వీలుంటే ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించాలని, ఇది సాధ్యం కానిపక్షంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తప్పకుండా ప్రతిపాదించాలని సుజనా చౌదరి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధ్యక్షుడితో భేటీ సందర్భంగా శాసన సభల సీట్లు పెంచటం ప్రధాన అంశం కాగా విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయటం, రాష్ట్ర విభజనకు సంబంధించి మిగిలిపోయిన ఆస్తుల పంపిణీని వీలున్నంత త్వరగా పూర్తి చేయటం గురించి చర్చించారని సమాచారం. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ను ఏర్పా టు చేయటం, ఆస్తుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయటం గురించి ఆయన షాతో చర్చలు జరిపారు. సుజనా చౌదరి చెప్పిందంతా సావధానంగా విన్న అమిత్ షా శాసనసభ సీట్లు పెంచటం గురించి ప్రధానమంత్రి, హోం శాఖ మంత్రితో చర్చిస్తానని మాత్రమే చెప్పారు తప్ప ఖచ్చితమైన హామీ ఇవ్వనట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/