ఓ పక్క ఏపీకి ప్రత్యేక హోదా మీద విపక్షాలు విరుచుకుపడుతుంటే.. మరోపక్క కేంద్రమంత్రి సుజనా చౌదరి మాత్రం కాస్త భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక హోదాను మరిపించే ప్యాకేజీ రానుందని.. అది కూడా ఈ నెలాఖరు నాటికే వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయటం విశేషం.
ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికి ఎన్ని పిల్లిమొగ్గలు వేయాలో అన్ని వేసిన మోడీ సర్కారు వైఖరితో.. సగటు సీమాంధ్రుడిలో ఆశలు సన్నగిల్లి.. ఆందోళనగా మారుతున్న సమయంలో.. ధీటైన ప్యాకేజీ మాటలు కేంద్రమంత్రి సుజనా నోటి నుంచి రావటం గమనార్హం. ఓ పక్క ధీటైన ప్యాకేజీ గురించి మాట్లాడుతూనే.. మరోపక్క ప్రత్యేక హోదా సాధన నిరంతర ప్రక్రియ అంటూ చెబుతున్న ఆయన మాటలు వింటేనే.. అసలు విషయం ఇట్టే అర్థమైపోతున్న పరిస్థితి.
ప్రత్యేక హోదా అంశం అటకెక్కిందని.. దాన్ని మరిపించేందుకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించటం ద్వారా.. ప్రత్యేక హోదా మీద పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నంగా చెబుతున్నారు. అందుకే సుజనా ప్రత్యేక ప్యాకేజీ అన్న ఊరింపు మాటలు చెబుతున్నారన్న మాట వినిపిస్తోంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఏపీకి లాభం కలుగుతుందని వ్యాఖ్యానిస్తున్న సుజనా మాటల్లోని అసలు విషయం గురించి ‘ప్రత్యేకం’’గా చెప్పాల్సిన అవసరం లేదేమో.