కేంద్రంలోని మోడీ సర్కారు ముక్కుపిండి.. ఏపీకి ఏం కావాలో చేయించుకోవటం చంద్రబాబు సర్కారు అంత చేతకావటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మోడీ సర్కారు తీరు మీద ఆశాభావం వ్యక్తం చేస్తూ.. కేంద్రం తమకు తప్పకుండా సాయం చేస్తుందని చెప్పేయటం.. మొండి చేయి చూపించినప్పుడు ముఖం చాటేయటం ఏపీ అధికారపక్షానికి ఒక అలవాటుగా మారింది.
ఇదిలా ఉంటే.. అప్పుడప్పుడు మోడీ సర్కారు తమకు అది చేయనుంది.. ఇది చేయనుంది.. వేలాది కోట్ల సాయం చేసేందుకు సిద్ధంగా ఉందంటూ ఊరించే వైఖరి కేంద్రమంత్రి సుజనా చౌదరికి అలవాటు. తమ ఒత్తిడికి తలొగ్గి కేంద్రం చాలానే చేస్తుందనే మాటను సుజనా చౌదరి తరచూ చెబుతుంటారు. అలాంటి ఆయన తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
కేంద్ర మంత్రి ఈ రోజు ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని తాను భావించటం లేదని సుజనా కుండ బద్ధలు కొట్టేశారు. కొద్ది గంటల తర్వాత ముఖాన గంటుపెట్టుకొని మీడియా ముందు మాట్లాడేందుకు ఇబ్బంది పడే కన్నా.. జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టటానికి ముందే.. తనకు తానే కేంద్రం ఈసారి ప్రత్యేక హోదా ఇవ్వదని చెప్పేస్తే సరిపోతుందని అనుకున్నారేమో కానీ.. ఎప్పుడూ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యే సుజనా.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా నెగిటివ్ గా మాట్లాడటం గమనార్హం.
ఏపీకి నిధులు ఇచ్చే విషయంలో కేంద్రానికి ఉండే ఇబ్బందులు కేంద్రానికి ఉన్నాయంటూ కవర్ చేసే ప్రయత్నం చేసిన సుజనా.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిదుల్ని కేంద్రం ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మోడీ సర్కారు మీద ఒత్తిడి పెట్టి ఏమీ సాధించలేమని.. కేవలం సహకారంతోనే ఏదైనా సాధించే వీలుందని చెప్పారు. ఇంచుమించు రెండేళ్లుగా ఏపీ సర్కారు అంతులేని సంయమనంతో వ్యవహరిస్తున్నందుకు ఏపీకి ప్రత్యేకంగా దక్కిందేమిటి సుజనా..?