సుజ‌న రాజ్య‌స‌భ సీటుపై ఏం జ‌రుగుతోంది...

Update: 2016-05-16 14:23 GMT
రాజ్య‌స‌భకు ఎవ‌రిని ఎంపిక చేయాలి? ఉన్న‌వారిని కొన‌సాగించాలా?  లేక కొత్త‌వారిని తీసుకోవాలా? అనే విష‌యంపై ఇప్పుడు ఏపీలో క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. అయితే రాష్ట్రం త‌ర‌ఫున ఖాళీ అయ్యే నాలుగు స్థానాల్లో ఒక‌రి ఎంపిక‌పై మాత్రం తీవ్రంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఆయ‌న‌పై ఉన్న అభియోగాల దృష్ట్యా.. ఇక ఆయ‌న‌కు ఉద్వాస‌న ప‌లుకుతార‌ని ఒక‌ప‌క్క ప్ర‌చారం జ‌రుగుతోంది! లేదు లేదు ఈసారి కూడా. నాకు సీటు గ్యారెంటీ అని.. ఆయ‌న ధీమాగా ఉన్నార‌ట‌. ఎవ‌రా ఆ ఎంపీ అంటే.. సుజ‌నా చౌద‌రి.

 కేంద్ర శాస్త్ర - సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.సుజనా చౌదరికి చెక్ పెట్టాలని టీడీపీ అధ్యక్షుడు - ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యత్వం వచ్చే నెల 21తో ముగియనుంది. ఆయనతోపాటు రాష్ట్రం నుంచి మరో ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు జూన్‌ లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. దీంతో టీడీపీలోని ఆశావహులు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఆశీస్సుల‌ కోసం ఎదురు చూస్తున్నార‌ట‌.

అయితే తన రాజ్యసభ సభ్యత్వాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనైనా పునరుద్ధరిస్తారని సుజనా చౌదరి ధీమాతో ఉన్నారట‌. కానీ.. ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వకూడ‌ద‌ని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదులు, కేసుల దృష్ట్యా సుజనాకు ఈసారి అవకాశం లేనట్లేనని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బ్యాంకులను మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సుజ‌న‌. ఈవిష‌యంలో కోర్టు వారెంట్ జారీ చేయడం, ఆయన కోర్టుకు హాజరు కావడం, ఆయన కంపెనీల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ పార్టీ నేతలు, ఇతరులు ప్రధానితోపాటు పలు సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. ఇక సుజ‌న‌ను మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు పంపే విష‌యంలో సీఎం ర‌మేష్‌ తో పాటు కంభంపాటి, ప‌లువురు టీడీపీ సీనియ‌ర్లు కూడా వ్య‌తిరేకిస్తున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాల స‌మాచారం. మ‌రి ఫైన‌ల్‌ గా సుజ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఎలా మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News