‘ఫైన్’.. కేంద్ర మంత్రి కొడుకును వదిలేశారు

Update: 2016-04-16 10:30 GMT
హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి వేళ కారు రేసింగులతో హల్ చల్ చేసి జనాలను భయభ్రాంతులను చేసి కేంద్రమంత్రి కుమారుడిని పోలీసులు సింపుల్ వెయ్యి రూపాయలు జరిమానాతో వదిలిపెట్టారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కుమారుడు కార్తీక్ తన మిత్రులను వెంటేసుకుని బంజారాహిల్సు నుంచి పంజాగుట్ట వరకు వేసుకున్న కారు పందేలతో జనం జడుసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదులు అందడంతో... వారు ఎంటరై కార్తీక్ అండ్ కో ను అదుపులోకి తీసుకున్నారు.

ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కారుతో సీజ్ చేసి కార్తీక్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఇటీవల కాలంలో ఏపీ టీడీపీ నేతల కుమారులు ఇలా పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. అదే క్రమంలో కార్తీక్ కూడా దొరకడంతో తండ్రి సుజనాకు ఇబ్బందులు తప్పవని భావించారు. కానీ... లక్కీగా ఈ కేసు సింపుల్ గా తేలిపోయింది. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారికి విధించే శిక్ష మాదిరే సుజనా కుమారుడికి కూడా రూ.1,000 జరిమానాను విధించి విడిచిపెట్టారు హైదరాబాద్ పోలీసులు.  అయితే... ర్యాష్ డ్రైవింగ్ తో జరిగే నష్టాలను వివరిస్తూ కార్తీక్ కు ఫుల్లుగా క్లాస్ మాత్రం పీకారట.
Tags:    

Similar News