టీడీపీ ఎంపీ - కేంద్ర మంత్రి సుజనాచౌదరి తీరు భలే ఆసక్తికరంగా ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా గురించి సీఎం చంద్రబాబు సహా అంతా ఆచి తూచి మాట్లాడుతూ మిగతా నాయకుల కంటే భిన్నంగా వ్యవహరించే సుజనా మాత్రం తేదీలతో సహా ప్యాకేజీ ప్రకటించారు. ఆస్పతిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలితను సందర్శించే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం వేచి చూస్తుండగా సుజనా వెళ్లి పరామర్శించారు. తానొక్కడినే వెళ్లడం ఎందుకని భావించారేమో కానీ...మరో ఇద్దరు ఎంపీలను తన వెంట తీసుకువెళ్లారు.
చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఉన్న జయలలితను సుజనాచౌదరితో పాటు మరో ఇద్దరు ఎంపీలు సీ.ఎం.రమేష్ - మురళీమోహన్ తాజాగా పరామర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో అమ్మ విడుదల తేదీని ప్రకటించారు. జయలలిత ఆరోగ్యం 95శాతం మెరుగుపడిందని వైద్యులు తెలిపారని సుజనా మీడియాకు చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స పొందుతున్నారని పేర్కొంటూ 10 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని సుజనా ప్రకటించారు. పార్టీ పరంగా - తన వ్యక్తిగతంగా ఉపయోగపడే అంశం అయితే తప్పకుండా ఆ కార్యం చేసేసే ఏపీ సీఎం చంద్రబాబు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ జయలలితను పరామర్శించకుండా ఉన్నప్పటికీ...సుజనా మాత్రం ఓ అటెండెన్స్ వేసుకొని రావడం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/