కవితతో చాట్ ను బయటపెట్టిన సుఖేష్ చంద్రశేఖర్

Update: 2023-04-12 17:20 GMT
దేశంలో పేరు మోసిన ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నాడు. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్  200 కోట్ల దోపిడీ, చీటింగ్ కేసుకు సంబంధించి కేసు నమోదై జైలుపాలయ్యాడు. ఈయనతో పాటు  బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై ఆరోపణలున్నాయి.

దేశంలో జరిగిన కీలక కేసుల్లో సుఖేష్ నిందితుడిగా ఉన్నాడు. పలు అక్రమ కేసుల్లోనూ ఈయన ప్రమేయం తాజాగా బయటపడుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ తాజాగా అతడి ప్రమేయం ఉన్నట్టుగా సుఖేష్ లేఖ రావాడు. అది ఈ కేసును మలుపుతిప్పింది.

తాజాగా సుఖేష్ తెలంగాణ ఎమ్మెల్సీ కవితపై మరో సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్ ఇదేనంటూ పలు స్క్రీన్ షాట్స్ ను సుఖేష్ విడుదల చేశాడు. తెలుగు రాని సుఖేష్ అక్కడక్కడా తెలుగు పదాలతో చాట్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కా అంటూ పలుమార్లు చాట్ లో సంభోదించాడు సుఖేష్.డబ్బు డెలివరీ చేశానంటూ వాట్సాప్ చాట్ లో సుఖేష్ పేర్కొన్నాడు. స్పోకెన్ టు మనీష్ అని రిప్లై కూడా ఇచ్చాడు.  

ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రాసిన లేఖలో సుఖేష్ చంద్రశేఖర్ పలు సంచలన విషయాలు వెల్లడించాడు. కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్ ఆదేశాలపై హైదరాబాద్ బీఆర్ఎస్ ఆఫీస్ లో రూ.15 కోట్ల డబ్బులు ఎమ్మెల్సీ కారులో ముట్టజెప్పినట్టు ఆరోపించాడు. అరుణ్ రామచంద్ర పిళ్లై ద్వారా ఈ డబ్బులు అందజేసినట్టుగా లేఖలో పేర్కొన్నాడు.

మనీలాండరింగ్ కేసులో మండోలి జైలులో ఉన్నాడు సుఖేష్ చంద్రశేఖర్. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ ఆప్ నేతలపై సంచలన ఆరోపణలు చేశాడు. సీఎం కేజ్రీవాల్ కు వందల కోట్లు ముట్టజెప్పినట్టు ఆరోపించాడు.

Similar News