జైలు అంటే ఎంతో క్రమశిక్షణతో ఖైదీలను కట్టడి చేసే ఒక సంక్లిష్ఠమైన వలయం. కానీ ఈ వలయం అనే పద్మవ్యూహాన్ని కూడా ఛేధించిన అర్జునుడు కాన్ మేన్ సుకేష్ చంద్రశేఖర్. 200 కోట్ల స్కామ్ లో బుక్కయినా కానీ అతడు జైల్లో రారాజులా సౌకర్యాలను అనుభవించాడు. జైల్లో అతగాడి లీలల గురించి తవ్వే కొద్దీ విస్తుగొలిపే నిజాలు బయటపడుతున్నాయి. ఆ మేరకు ప్రముఖ మీడియాల్లో తాజా కథనాలు సంచలనాలుగా మారుతున్నాయి.
మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తీహార్ (దిల్లీ) జైల్లో ఉన్నప్పుడు అతడిని కలిసేందుకు అతడి భార్య లీనా మరియా పాల్ వీలున్నప్పుడల్లా వచ్చేవారట. అక్కడికి వచ్చి తనతో ఎంతో సమయం గడిపి వెళ్లేవారట. ఆమె వచ్చేందుకు జైలర్లు కానీ ఇతర అధికారులు కానీ అడ్డు చెప్పేవారు కారు. అంతేకాదు.. జైలునే సుకేష్ తన ఆఫీస్ గా మార్చుకున్నాడు.
ఆ పరిసరాల్ని ఎంతో విలాసవంతంగా మార్చాడు. వినోదం వార్తల కోసం టెలివిజన్.. ఫ్రిడ్జ్.. బెడ్ సహా ఇతర సౌకర్యాలను సమకూర్చుకుని అతడు సుఖించిన తీరు మామూలుగా లేదు! అంటూ సదరు కథనం పేర్కొంది.
అతడిని జైల్లో కలిసేందుకు ప్రియురాలు జాక్విలిన్ ఫెర్నాండెజ్.. నోరా ఫతేహి సహా దాదాపు 20 మంది టాప్ మోడల్స్ కూడా వచ్చి వెళ్లారని ఇందులో మరికొందరు నటీమణులు కూడా ఉన్నారని కూడా తాజా దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా అతడు జైలును ఒక కార్పొరెట్ ఆఫీస్ లా మార్చుకుని కార్యకలాపాలు కొనసాగించేవాడనే నిజం విస్తుగొలుపుతోంది.
అంతగా ఆ జైలర్లు సహకరించారన్న కథనాలు వేడెక్కిస్తున్నాయి. సుకేషుని లీలలు భోగాల గురించి ఎంత చెప్పినా తరిగేవి కావని కథనాలొస్తున్నాయి. ఇక సుకేష్ స్నేహితురాళ్లు జాక్విలిన్ ఫెర్నాండెజ్.. నోరా ఫతేహి మధ్య గొడవల గురించి తెలిసిందే. సుకేష్ తో సాన్నిహిత్యం కోసం ఆ ఇద్దరూ చాలా ఘర్షణ పడ్డారు.
ప్రముఖులకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మబలికి వారి భార్యల నుంచి కోట్లాది రూపాయలు గుంజాడు. జయలలిత మరణానంతరం రెండు ఆకుల గుర్తు ఇప్పిస్తానంటూ సన్ టీవీ యజమానితో కోట్లాది రూపాయల డీల్ మాట్లాడుకున్నాడు. కానీ ఆ ప్లాన్ బెడిసి కొట్టడంతో అతడు పోలీసులకు చిక్కాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.