కర్ణాటక రెబల్ స్టార్ అంబరీష్ చనిపోయాక ఆయన భార్య సుమలత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ హయాంలో మంత్రిగా చేసిన అంబరీష్ తన సొంత జిల్లా అయిన మాండ్యపై చెరగని ముద్రవేశారు. ఎంతో అభివృద్ధి చేశారు. అందుకే మాండ్యపై అభిమానంతో.. అక్కడి ప్రజల కోరిక మేరకు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మాండ్య నుంచి పోటీచేయబోతున్నట్టు తాజాగా అంబరీష్ భార్య - ప్రముఖ నటి సుమలత ప్రకటించారు.
తనకు రాజకీయ పదవుల్లో కొనసాగాలనే తపన ఎంత మాత్రం లేదని.. మాండ్యపై అభిమానంతోనే ఇక్కడ వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నట్టు సమలత పేర్కొన్నారు. గురువారం మద్దూరు తాలూకా చిక్కరసనిక కెరెలోని కాలభైరవ ఆలయంలో పూజలు చేసిన సుమలత మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు.
తన భర్త జన్మస్థలం మాండ్య జిల్లా పై ప్రేమ - విశ్వాసం కలిగి ఉండేవారని సుమలత తెలిపారు. ఆ అభిమానం తనపై కూడా చూపిస్తున్నారని.. అందుకే మాండ్య నుంచి సీటు కోసం కర్ణాటక కాంగ్రెస్ బాధ్యులు సిద్ధరామయ్యను కలిశానని చెప్పుకొచ్చారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీచేయడానికి అడిగానని తెలిపారు. అంబరీష్ కూడా సుధీర్ఘకాలం కాంగ్రెస్ లోనే ఉండి మాండ్య జిల్లా నుంచి పోటీచేసి మంత్రి అయ్యారు.