సాధారణంగా మహా శివరాత్రి ముందు వరకు వాతావరణం చల్లగా ఉండటం.. ఈ పర్వదినం దాటినంతనే ఎండ తీవ్రత పెరగటం తెలిసిందే. ఈసారి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శివరాత్రికి దాదాపు వారం ముందు నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. పండుగ తర్వాత నుంచి ఎండలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
ఇలాంటివేళ.. ఓవైపు ఎండ ఉంటూనే.. మరోవైపు చల్లగాలులు రెండు మూడు రోజులుగా కనిపిస్తున్నాయి. సాధారణంగా వేసవి కాలంలో కనిపించని కొత్త తరహా వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది. ఎందుకలా? అన్నది చూస్తే.. దానికి కారణం తీవ్ర రూపంగా మారిన వాయు గుండ ప్రభావమే.
ఆగ్నేయ బంగాళాఖాతంలో తెలెత్తిన వాయుగుండం.. సోమవారానికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందంటున్నారు. రానున్న పన్నెండు గంటల్లో అండమాన్ దీవుల వెంట ఉత్తరం వైపు కదులుతుందని.. ఇది తుపానుగా మారుతుందని చెబుతున్నారు. మయన్మార్ లోని తాండ్వే సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్న ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసాయి.
తెలంగాణలోనూ వాతవరణం చల్లబడింది. కొద్ది రోజులుగా మంటలు పుట్టిస్తున్న ఎండ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టి.. వాతావరణం చల్లగా మారింది. ఇదిలా ఉంటే.. విశాఖ మన్యంలో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. నర్సీపట్నం.. పాడేరు.. కొయ్యూరు.. హుకుంపేట.. కోటవురట్ల మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్లు పడ్డాయి.
అనూహ్యంగా కురిసిన వర్షంతో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
చిత్తూరు జిల్లా మదనపల్లిలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే.. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో 3.5సెంటీమీటర్ల వర్షం, విశాఖ జిల్లా నర్సీపట్నంలో 3.8 సెంటీమీటర్లవర్షం నమోదైంది. ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అనూహ్యంగా విరుచుకుపడ్డ వర్షంతో విద్యుత్తు తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుంది. పలు గ్రామాల్లో పెద్ద చెట్లు నేలకు ఒరగడటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.