తెలంగాణ కోసం గొంతు కలిపి.. తెలంగాణ సాధన కోసం తన సహచర నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి అధినేత్రిని ఒప్పించిన వారిలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఒకరు. అలాంటి ఆమెకు ఇప్పుడు తెలంగాణ ఎందుకు వచ్చిందా అని అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న రైతుల ఆత్మహత్య లపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి 1200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఒక్క మెదక్ జిల్లాలోనే 180 మంది అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారని చెప్పారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎలాంటి ఆర్థిక సాయం అందటం లేదని విమర్శించిన సునీతా లక్ష్మారెడ్డి.. విదేశీ పెట్టుబడులు అవసరమే అయినా.. రైతుల ఆత్మహత్యలు అంతకంటే తీవ్రమైన అంశమని.. అన్నదాతల కష్టాల్ని తీర్చాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు అదేమీ పట్టటం లేదని విమర్శించారు. చూస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనకు ఎంచుకున్న టైం ఏమాత్రం బాగోలేనట్లుగా కనిపిస్తోంది.