కర్ణాటకలో నిర్వహించిన పరీక్షలో ఓ అభ్యర్థి ఫొటోకు బదులు సన్నీలీయోన్ నగ్నచిత్రం ముద్రించి ఉండడం వైరల్ అయ్యింది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నవంబర్ 6న జరిగిన కర్ణాటక టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET-2022)కి హాజరైన అభ్యర్థి హాల్ టిక్కెట్‌పై బాలీవుడ్ నటి సన్నీ లియోన్ చిత్రం ముద్రించబడి ఉండడం దుమారం రేపింది..అడ్మిట్ కార్డు స్క్రీన్ షాట్ వైరల్ కావడంతో విద్యాశాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.
కర్ణాటకలోని రుద్రప్ప కాలేజీలో ఓ అభ్యర్థి తన హాల్‌టికెట్‌తో సన్నీలీయోన్ ఫొటో ఉందని చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది, ఆ తర్వాత సంస్థ ప్రిన్సిపాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దరఖాస్తును ఆన్‌లైన్‌లో దాఖలు చేసేటప్పుడు.. సమర్పించేటప్పుడు ఫోటోను అప్‌లోడ్ చేసే సమయంలో ఈ పొరపాటు జరిగిందని తేల్చారు.
అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూరించలేదని, తన తరపున ఇతరులను చేయమని కోరారని తెలిపింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూరించాలని, దాని కోసం వినియోగదారు ఐడి.. పాస్‌వర్డ్ రూపొందించబడిందని, ఇది అభ్యర్థికి ప్రత్యేకమైనదని.. దానితో ఎవరూ జోక్యం చేసుకోలేరని విద్యా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పరీక్ష హాల్‌టికెట్‌ను అభ్యర్థులు మాత్రమే రూపొందించాలి కాబట్టి దానిలో తమ పాత్ర ఏమీ లేదని డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఈ పొరపాటు అభ్యర్థి తప్పుడు ఫొటోను ఎంచుకోవడం వల్లే జరిగిందని విద్యాశాఖ వివరణ ఇచ్చింది.
"ఈ సమస్యపై ఏ మీడియా వైరల్ చేసినా ఇందులో విద్యాశాఖ డిపార్ట్‌మెంట్ పాత్ర లేదు. ఈ విషయంపై విచారణ జరిపి, ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మేము పోలీసులను అభ్యర్థించాము" అని పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ తన వివరణలో పేర్కొంది.
మొత్తంగా సన్నీలీయోన్ ఫొటోతో పరీక్షకు హాజరైన ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.