సన్నీలియోన్ దగ్గర మోడీయే ఓడిపోయారు

Update: 2015-12-17 11:13 GMT
బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ అంటే ఇష్టపడని మగవారు ఉండరేమో... ఆమె ప్రస్తుతం నటిస్తున్న బాలీవుడ్ సినిమాలే కాదు పూర్వాశ్రమంలో ఆమె నటించిన ఫిలింలను కూడా ఇప్పటికీ ఎంతోమంది చూస్తుంటారు. అందానికి అందం - అభినయానికి అభినయం - శృంగారానికి శృంగారం అన్నట్లుగా ఉండే సన్నీకి ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. అయితే... ఆమెకు ఉన్న ఆదరణ ఎంత అన్నదానికి ఇంతవరకు ఎవరికీ కొలమానం తెలియకపోయినా తాజాగా మాత్రం ఆమె పాపులారిటీ ఎంతన్నది పక్కాగా తెలిసింది. అందుకు గూగుల్ సెర్చే కొలమానం. గూగుల్ సెర్చ్ లో ఇండియా కేటగిరీలో అత్యధికులు వెతికింది సన్నీ కోసమేనట. అవును... 2015లో భారతీయులు గూగుల్ అత్యంత ఎక్కువగా వెతికింది సన్నీ కోసమేని ఆ సంస్థ తాజా గణాంకాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో ఆమె సినీరంగానికి చెంది టాప్ స్టార్ లు సల్మాన్ - షారూక్ లను వెనక్కి నెట్టేయడంతో పాటు రాజకీయ నేతలు - స్ఫూర్తిదాతలను కూడా మించిపోయింది. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ, మాజీ రాష్ట్రపతి కలాంలను కూడా సన్నీ దాటేసింది. సల్మాన్ - షారూక్ - మోడీ అంతా కూడా సన్నీ లియోన్ వెనకనే ఉన్నారు.

 భారతీయుల సెర్చ్ చేసినవారిలో టాప్ టెన్ లిస్ట్ ఇదీ..

1) సన్నీ లియోన్

2) సల్మాన్ ఖాన్

3) ఏపీజే అబ్దుల్ కలాం

4) కత్రినా కైఫ్

5) దీపికా పడుకునే

6) షారూక్ ఖాన్

7) యోయో హనీ సింగ్

8) కాజల్ అగర్వాల్

9) అలియా భట్

10) నరేంద్ర మోడీ
Tags:    

Similar News