జోరందుకున్న టీకాల సరఫరా

Update: 2021-05-17 06:30 GMT
దేశం యావత్తు కరోనా టీకాల కోసం నానా అవస్తలుపడుతోంది. అన్నీ రాష్ట్రాల్లోను టీకాల కొరత ప్రభుత్వాలను, ప్రజలను పట్టి పీడిస్తోంది. ఈ పరిస్ధితుల్లో రాబోయే మూడు రోజుల్లో పెద్ద ఎత్తున టీకాలను దేశమంతా సరఫరా చేయాలని కేంద్రం డిసైడ్ చేసింది. రాబోయే మూడురోజుల్లో 51 లక్షల టీకాలను పంపిణీ చేయటానికి కేంద్రం అన్నీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికి సుమారు 19 కోట్ల డోసులు జనాలకు వేసిన విషయం తెలిసిందే.

కేంద్రం పంపుతున్న టీకాల్లో కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు కలిసే ఉన్నాయి. అయితే ఇవికాకుండా రష్యా తయారీ టీకా స్పుత్నిక్ విడిగా వస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో స్పుత్నిక్ టీకా నేరుగా రష్యా నుండి సుమారు 3 లక్షల డోసులు వచ్చాయి. మరో వారం, పదిరోజుల్లో ఇంకా పెద్దఎత్తున టీకాలు రాబోతున్నాయి. రష్యా టీకాను మనదేశంలో రెడ్డీస్ ల్యాబరేటరీ తయారు చేస్తోంది.

మొదటి రెండు మూడు విడతల టీకాలు మాత్రమే రష్యానుండి నేరుగా మనదేశానికి వస్తుంది. ఇక ఆ తర్వాత మార్కెట్లో దొరికే ప్రతి టీకా రెడ్డీ ల్యాబరేటరీలోనే ఉత్పత్తవుతుంది. మే చివరి వారంనుండి టీకాల ఉత్పత్తిని పెంచి మార్కెట్లోకి చెలామణిలోకి తీసుకురావాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను కూడా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయటానికి ఆయా యాజమాన్యాలు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి.

కేంద్రం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే జూన్ మొదటివారం తర్వాత ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీల టీకాలు కూడా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇదే సమయంలో డీఆర్డీవో తయారు అభివృద్ధిచేసిన 2డీజీ మందు కూడా మార్కెట్లోకి రాబోతోంది. కాబట్టి జూన్ మొదటివారం తర్వాత జనాలు టీకాల కోసం ఇపుడు పడుతున్న టెన్షన్ అవసరం లేదని చెప్పవచ్చు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News