కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్ వల్ల దేశంలో అన్ని రంగాలూ, విభాగాలూ మూతపడిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే మెల్లమెల్లగా అన్ని రంగాలూ సర్దుకుంటున్నాయి. విద్యారంగం మాత్రం ఇంకా మూతపడే ఉంది. ఈ విద్యాసంవత్సరం ఇలాగే ముగుస్తుందేమో తెలియదుగానీ.. అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలను తిరిగి ప్రారంభించడంపై కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. అంగన్‌వాడీ కేంద్రాల తిరిగి ప్రారంభించేందుకు జనవరి 31 లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. అయితే, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు.. విపత్తు నిర్వహణ అధికారులను సంప్రదించిన తర్వాతనే కేంద్రాలను తెరవడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పింది.
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం షెడ్యూల్-2 ప్రకారం తప్పనిసరిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు.. పిల్లలు, తల్లులకు పోషక ఆహారాన్ని అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలు, బాలింతులు, గర్భిణులకు పోషక ఆహారాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.