ఏపీ - తెలంగాణ వివాదాల్లో ఒక్కోసారి ఒక్కొక్కరిది పైచేయి అవుతోంది. రెండు రాష్ర్టాల మధ్య పలు వివాదాలు ఉండగా వాటిలో కొన్ని కోర్టుల వరకు చేరాయి. న్యాయస్థానాల్లో రెండు రాష్ర్టాలూ తమతమ వాదనలు వినిపిస్తూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఉన్నత విద్యామండలి ఆస్తుల విషయంలో నెలకొన్న వివాదంలో సుప్రీం కోర్టు తెలంగాణకు షాకిచ్చింది. ఆ రాష్ట్రం రెండోసారి వేసిన రివ్యూ పిటిషన్ ను కనీసం విచారణకు కూడా తీసుకోకుండా నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ దాఖలు చేసిన రెండో రివ్యూ పిటిషన్ విచారణకు సైతం అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆస్తులను జనాభా ప్రాతిపదికన ఏపీ - తెలంగాణ 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని సుప్రీంకోర్టు మార్చి 18న తీర్పు వెలువరించింది. ఏప్రిల్ 18న తెలంగాణ ప్రభుత్వం - తెలం గాణ ఉన్నత విద్యామండలి రెండు రివ్యూ పిటిషన్లను దాఖలు చేశాయి. మొదటి రివ్యూ పిటిషన్‌ను జస్టిస్ గోపాలగౌడ - జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ నెల పదో తేదీన సుప్రీంకోర్టు ఛాంబర్ లో విచారణకు తిరస్కరించింది.
కాగా దీనిపై తెలంగాణ మరోసారి రివ్యూ పిటిషన్ వేయగా అదే ధర్మాసనం మంగళవారం కూడా తిరస్క రించింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కేసులో గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ - ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సమస్య లుంటే రెండు నెలల్లోగా కేంద్రం పరిష్కరించాలని కోర్టు నిర్దేశించింది. అనంతరం ఢిల్లి లో హోం శాఖ కార్యాలయంలో రెండు రాష్ట్రాల అధికారులతో రెండు దఫాలుగా నిర్వహించిన సమావేశాల్లోనూ తెలంగాణ ప్రభుత్వం.. కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని తేల్చి చెప్పింది. ఏప్రిల్ 18న అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లను దాఖలు చేసింది. జస్టిస్ గోపాలగౌడ - జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం రెండు రివ్యూ పిటిషన్ల విచారణకు తిరస్కరించింది.