అనుకున్నదే జరిగింది. అంచనాలు నిజమయ్యాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీప్ పదవి పోయింది. పనామా లీకులతో పదవి కోల్పోయిన అత్యున్నత స్థాయి నేతల్లో నవాజ్ షరీఫ్ తాజా బాధితుడిగా మారారు. నవాజ్ షరీఫ్ తో పాటు.. ఆయన కటుంబ సభ్యులు నిందితులుగా ఉన్న పనామా గేట్ కుంభకోణం కేసులో పాక్ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది. ఆయన్ను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పును ఇచ్చింది.
ఆరుగురు సభ్యుల సంయుక్త దర్యాప్తు బృందం జులై 10న సమర్పించిన నివేదిక ఆధారంగా పాక్ సుప్రీంకోర్టు తాజా తీర్పును ప్రకటించింది. నవాజ్ షరీఫ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది. 1990ల్లో నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్నప్పుడు లండన్ లో భారీగా ఆస్తులు కూడగట్టుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై జిట్ విచారణ చేపట్టింది. ఈ అవినీతికి సంబంధించిన వివరాల్ని గత ఏడాది విడుదలైన పనామా పత్రాల్లో నవాజ్ షరీఫ్ పేరు ఉండటం సంచలనంగా మారింది.
షరీఫ్ పిల్లల పేరిట ఉన్న డొల్ల కంపెనీల ద్వారా నగదును దేశం దాటించిన అభియోగాలు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఆయన పాక్ ప్రధాని పదవి నుంచి వైదొలగాల్సి పరిస్థితి ఏర్పడింది.