కరోనా చికిత్సలపై సుప్రీం కీలక ఆదేశాలు

Update: 2020-07-15 09:15 GMT
దేశాన్ని కరోనా కమ్మేస్తోంది.  అందరికీ వైరస్ సోకుతుండడంతో ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ఖర్చును నియంత్రించేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది సచిన్ జైన్ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించింది.

చికిత్సకు ఎక్కువ ఖర్చు అవుతుందంటూ ఏ ఆస్పత్రి కూడా రోగులను వెనక్కి పంపకూడదని ప్రైవేట్ ఆస్పత్రులకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కరోనా సోకిన రోగుల చికిత్సకు అయ్యే వ్యయంపై  మార్గదర్శకాలు రూపించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో చికిత్స ఖర్చు ఎక్కువగా ఉండకూడదని సూచించింది.

దీనిపై కేంద్రం తరుఫున లాయర్ వాదించారు. కరోనా వైరస్ కు సంబంధించిన అన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని.. పిటీషనర్ పేర్కొన్న అంశాలను పరిశీలస్తామని తెలిపారు.
Tags:    

Similar News