చంద్రబాబుకు సుప్రీం కోర్టు షాక్

Update: 2019-05-07 07:41 GMT
ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రతిపక్షాలకు దిమ్మదిరిగిపోయింది. మోడీని ఇరుకునపెట్టాలని.. ఈవీఎంలలో మోసాలు నిజమని నిరూపించాలని పట్టుదలతో సుప్రీం కోర్టు మెట్లు ఎక్కిన చంద్రబాబుకు కోర్టు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది.  ఈవీఎంల అక్రమాలపై గొంతెత్తి సగం వీవీప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు సహా దేశంలోని విపక్షాలన్నీ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. ఈ విషయంలో దేశవ్యాప్తంగా రచ్చ చేస్తున్నారు చంద్రబాబు. తాజాగా మంగళవారం  సుప్రీం కోర్టు ఈ విషయమై విచారణ జరిపింది. కేసులో ఎటువంటి వాదనలు వినకుండానే కేసును సుప్రీం కోర్టు కొట్టి వేసింది.

కేంద్రంలోని బీజేపీ..ఆంధ్రప్రదేశ్ లో  ప్రతిపక్ష వైసీపీకి మేలు చేసేలా ఈవీఎంల ట్యాంపరింగ్ చేసిందని బాబు ఆరోపిస్తూ దీన్ని దేశవ్యాప్త ఉద్యమం చేశారు. ప్రతిపక్ష 21 పార్టీలతో కలిసి 50శాతం వీవీప్యాట్స్ లెక్కించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.   ఈవీఎం వీవీ ప్యాట్ల లెక్కింపు వివాదంపై ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తొలిసారి సుప్రీం కోర్టుకు ప్రతిపక్ష నేతలతో కలిసి స్వయంగా హాజరయ్యారు. వ్యక్తిగత కేసుల విషయంలో కూడా హాజరు కాని బాబు ఇలా వచ్చేసరికి అందరూ షాక్ అయ్యారు. కానీ సుప్రీం కోర్టు బాబుకు షాకిచ్చింది. ఈ కేసును కొట్టివేసింది. మరిప్పుడు చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.

అయితే ఈసీ ఇప్పటికే నియోజకవర్గానికి 5 వీవీ ప్యాట్లను లెక్కించాలని నిర్ణయించింది. అయితే 50శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు వాదించారు. ఈవీఎంల వీవీ ప్యాట్స్ లెక్కింపు  విషయంలో చంద్రబాబు తప్ప ఇతర పార్టీల నేతలెవరు పెద్దగా పట్టించుకోలేదు.

ఇప్పటికే ఏపీ ఎన్నికల్లో ఈసీకి, చంద్రబాబుకు పడలేదు. అందుకే ఈసీ అక్రమాలంటూ ఆయన ఆరోపించారు. ఈసీపై పైచేయి సాధించాలన్న పట్టుదలతో చంద్రబాబు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ముద్దు అనే నినాదాన్ని తెచ్చారు.  చివరకు 21 పార్టీలతో కలిసి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.. కానీ మొత్తంగా బాబుకు సుప్రీం కోర్టు గట్టి షాక్ ఇచ్చింది.

సుప్రీం కోర్టు తీర్పుతో బాబు ఆశలు అడియాసలయ్యాయి. విపక్ష 21 పార్టీలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేశాయి.

   


Tags:    

Similar News