రాజకీయ పార్టీలకు షాకిచ్చిన సుప్రీంకోర్టు?

Update: 2021-07-21 17:30 GMT
రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల నేరచరిత్రను వెల్లడించని పార్టీలపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే అనే విషయంలో సుప్రీంకోర్టులో సుధీర్ఘ విచారణ చేపట్టింది. దీనిపై తీర్పును రిజర్వులో ఉంచింది.  రిజర్వులో ఉంచిన తీర్పులో ఏముందో తెలియక పార్టీలో టెన్షన్ మొదలైపోయింది.

ఈ విచారణ సందర్భంగా ఎన్నికల కమిషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన లాయర్ తోపాటు రాజకీయ పార్టీ తరుఫున మరికొందరు సీనియర్ లాయర్లు కూడా తమ వాదనలు వినిపించారు. మెజారిటీ లాయర్లు వినిపించిన వాదనల ప్రకారమైతే అభ్యర్థుల నేరచరిత్రను వెల్లడించని పార్టీల గుర్తింపును రద్దు చేయటమో లేకపోతే పార్టీల ఎన్నికల గుర్తులను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలంటూ బలంగా వాదించారు.

ఈ విషయంలో ఎవరు ఎలా వాదించినా సరే నేరచరిత్రను వెల్లడించని పార్టీలపై చర్యలు తీసుకోవాల్సిందే అనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతో ఉన్నట్లుగా అర్థమవుతోంది. అందరి వాదనలు విన్న న్యాయమూర్తులు కూడా లాయర్ల వాదనతో ఏకీభవించారు.

పార్టీలపై కఠినమైన చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఉందన్న లాయర్ల వాదనతో జడ్జీలు సానుకూలంగా స్పందించారు. దాంతో తీర్పును రిజర్వులో ఉంచారు.

తాజాగా బీహార్ ఎన్నికల్లో అభ్యర్థుల నేరచరిత్రను పార్టీలు వెల్లడించలేదట.. ఇదే విషయమై సీపీఎం, ఎన్సీపీ తరుఫున లాయర్లు క్షమాపణ చెప్పినా కోర్టు మాత్రం అంగీకరించలేదు.

నేరచరిత్రను తెలుపని పార్టీలపై చర్యలు తీసుకునే బదులు.. నామినేషన్ వేసినప్పుడే అభ్యర్థుల నేరచరిత్ర తెలుపకపోతే వారిని తిరస్కరిస్తే పార్టీలకు ఈ తిప్పలు ఉండేవి కాదు కదా? అని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
Tags:    

Similar News