అమరావతి భూముల వ్యవహారం పై ఈ రోజు దేశ అత్యున్నతమైన న్యాయస్థానమైన సుప్రీం కోర్టు లో కీలక విచారణ జరిగింది. సిట్, కేబినెట్ సబ్ కమిటీపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఐతే , ఆ నోటీసులకు టీడీపీ నేతలు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని.. లేదంటే తాము ప్రొసీడ్ అవుతామని హెచ్చరికలు జారీచేసింది. దీనితో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి గడువు కావాలని ప్రతి వాదులు కోరారు. దీనికి సమ్మతించిన సుప్రీంకోర్టు రెండు వారాల సమయాన్ని కేటాయించింది.
రెండు వారాల్లో కౌంటర్ దాఖలు టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దమ్మాలపాటి కేసును కూడా అప్పుడే విచారిస్తామన్న సుప్రీంకోర్టు.. ఇప్పటికే హైకోర్టులో ఈ కేసు విచారణను జరపొద్దని చెప్పామని జస్టిస్ అశోక్ భూషణ్ స్పష్టం చేశారు. మార్చి 5న పూర్తి స్థాయి వాదనలు వింటామని తెలిపారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ మార్చి 5కి వాయిదా వేసింది.