దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒక అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తికి.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య వాగ్యుద్ధం లాంటిది చోటు చేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయిన కట్జూకి.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం మధ్య చోటు చేసుకున్న అసాధారణ వాగ్యుద్ధం సంచలనంగా మారింది. ఏ కోర్టులో అయితే తీర్పులు ఇచ్చారో.. అదే కోర్టులో ‘కోర్టు ధిక్కార నోటీసు’ అందుకోవాల్సిన పరిస్థితిని జస్టిస్ మార్కండేయ కట్జూ ఎదుర్కొన్నారు. ఎందుకిలా జరిగింది? అసలేం జరిగింది? సుప్రీంకోర్టులో వాగ్యుద్ధం ఏ స్థాయిలో జరిగింది? అన్న విషయాల్లోకి వెళితే..
తాజా ఘటనకు సంబంధించిన స్పష్టత రావాలంటే గతంలోకి వెళ్లాలి. అసలు సమస్య ఎక్కడ మొదలైందో అన్నది చూడాలి. 2011లో దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఒక ఉదంతం కేరళలో చోటు చేసుకుంది. ఒక హాస్పిటల్ లో నర్సుగా పని చేసే సౌమ్య.. తన విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో ఆమె ట్రైన్లో ప్రయాణించారు. ఈ సమయంలో ఆమె అత్యాచారానికి గురై.. ఆ పై కదులుతున్న రైలు నుంచి నెట్టేశారు. దీంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మరణించారు. దీనిపై కిందికోర్టులు నిందితుడ్ని దోషిగా తేలుస్తూ మరణశిక్షను విధించాయి. అయితే.. దీన్ని సుప్రీంకోర్టు మరణశిక్ష నుంచి పరిమిత కాలానికి జైలుశిక్షగా తీర్పు ఇచ్చింది. సౌమ్యను అత్యాచారం చేసిన వైనం నిరూపితమైనప్పటికీ.. ఆమె మరణానికి నిందితుడే కారణమన్న విషయాన్ని నిరూపించలేకపోవటంతో కింది కోర్టులు ఇచ్చిన తీర్పును సవరించింది.
దీనిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కట్జు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫేస్ బుక్ లో ఒక వ్యాసం రాశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో మౌలికపరమైన లోపాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పులో ఉన్న లోపాల్నిధర్మాసనం ముందుకు వచ్చి వివరించాలని సుప్రీం ఆయన్ను కోరింది. దీంతో.. ఆయన శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. సౌమ్య హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునస్సమీక్ష పిటీషన్ ను కొట్టేయటంతో పాటు.. కట్జూపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. నోటీసు జారీ చేయగానే స్పందించిన కట్జూ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ ను ఉద్దేశించి.. ‘‘ఒక సుప్రీంకోర్టు జడ్జి ఇలా ప్రవర్తించకూడదు. ఇది బెదిరింపులా ఉంది. నాతో నవ్వులాట వద్దు. మీరు రిక్వెస్ట్ చేస్తే వచ్చా. నాతో అలా వ్యవహరించటం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. తాను బెంచ్ ముందు హాజరయ్యానని.. బెంచ్ లోని న్యాయమూర్తుల కన్నా తాను సీనియర్ ను అని.. అలాంటి తనను బెదిరించటం సరికాదంటూ పదే పదే వ్యాఖ్యానించారు. సౌమ్య ఉదంతంలో సుప్రీం ఇచ్చిన తీర్పు ఎందుకు తప్పో కట్జూ తన కోణంలో వివరించారు. సౌమ్య కేసులో నిర్ణయానికి వచ్చే ముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇంగితాన్ని ప్రదర్శించలేదని.. సౌమ్యను తోసేయటం వల్లే ఆమ మరణించిన విషయాన్ని వారువిస్మరించినట్లుగా కట్జూ వ్యాఖ్యానించారు.
ఇదిలా సాగుతూ.. కట్జూకు.. ముగ్గురు సభ్యులున్న ధర్మాసనం సభ్యుల మధ్య అసాధారణ రీతిలో వాదనలుజరిగి.. ఒక దశలో తీవ్ర వాగ్యుద్ధానికి తెర తీసింది. తనను బెదిరించే ప్రయత్నం చేయొద్దని జస్టిస్ కట్జూ వ్యాఖ్యానిస్తే.. దీనికి స్పందించిన గొగోయ్.. ‘మమ్మల్ని మరింత కవ్వించొద్దు’ అని వ్యాఖ్యానించారు. దీనికి రియాక్ట్ అయిన కట్జూ.. ‘‘మీరే ఈ తరహాలో బెదిరింపులతో నన్నుకవ్విస్తున్నారు. మీరే నన్ను ఇక్కడికి వచ్చి సహాయం చేయాల్సిందిగా అర్థించారు’’ అని తీవ్రంగా స్పందించారు. దీంతో.. జస్టిస్ గొగోయ్.. ‘‘జస్టిస్ కట్జూను బయటకు తీసుకెళ్లటానికి ఎవరైనా ఉన్నారా?’’ అని తీవ్రంగా స్పందించారు. దీనికి కోర్టు హాలు నుంచి బయటకు వెళ్తున్న కట్జూ.. ‘‘ఇదేం ప్రవర్తన? మీ అభ్యర్థన మేరకే నేను ఇక్కడికి వచ్చాను. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తితో వ్యవహరించే పద్ధతి ఇదేనా? అయాం సారీ’ అనగా.. దీనికి న్యాయమూర్తులు కూడా.. ‘‘వుయ్ ఆర్ ఆల్సో సారీ’ అని వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/