కేరళ వరదలు.. ఆ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే.. దేశ, విదేశీ ప్రముఖులందరూ కేరళకు ఆర్థికసాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. స్వయంగా కేరళ వాసులు తమ సొంత రాష్ట్రం కోసం ఏం చేయడానికైనా రెడీ అవుతున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. వారు తమ సొంత రాష్ట్రం కోసం తాజాగా చేసిన పని వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో కేరళ రాష్ట్రానికి చెందిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఢిల్లీలో కేరళ బాధితుల కోసం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు స్వయంగా పాటలు పాడడం విశేషంగా చెప్పవచ్చు. జస్టిస్ కురియన్ జోసెఫ్ - జస్టిస్ కేఎం జోసెఫ్ లు ఈ కార్యక్రమంలో విడివిడిగా పాటలు పాడారు. ఈ న్యాయమూర్తులు ఇద్దరూ కేరళకు చెందిన వారే.. మత్స్యకారుడి జీవితాన్ని కళ్లకు కట్టే ‘అమరం’ అనే మలయాళం చిత్రంలోని పాటను జస్టిస్ కేఎం జోసెఫ్ పాడారు. ‘వియ్ షల్ ఓవర్ కమ్ సమ్ డే’ అనే పాటను జస్టిస్ కురియన్ జోసెఫ్ , సినీ గాయకుడు మొహిత్ చౌహాన్ తో కలిసి పాడారు.
ఈ కార్యక్రమంలో జస్టిస్ లు ఇద్దరు పాడిన పాటలు అందరినీ ఉర్రూతలూగించింది. జనం చప్పట్లతో ప్రశంసించారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. కేరళ వరద బాధితుల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా రూ.10 లక్షలకు పైగా నిధులు సమకూరాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక్కొక్కరు రూ.25వేల సాయం అందజేశారు. అటార్నీ జనరల్ కేకే.వేణుగోపాల్ రూ.కోటిని విరాళంగా ఇచ్చారు. వేణుగోపాల్ కుమారుడు కృష్ణన్ వేణుగోపాల్ రూ.15 లక్షలు, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి రూ.50 లక్షలు ప్రకటించారు. ఇలా దేశమొత్తమే కాదు.. స్వయంగా కేరళ రాష్ట్రానికి చెందిన సుప్రీం న్యాయమూర్తులు కూడా తమ సొంత రాష్ట్రం కోసం ఇంతలా రియాక్ట్ కావడం అందరినీ అలరించింది.