ఆంధ్ర‌..తెలంగాణ‌..ఛ‌త్తీస్ గ‌ఢ్ ల‌కు సుప్రీం శ్రీముఖం

Update: 2016-09-30 09:53 GMT
ఓప‌క్క జెట్ స్పీడ్ తో పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని భావిస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆశ‌ల‌కు.. ఆకాంక్ష‌ల‌కు దెబ్బ ప‌డే ప‌రిస్థితి ఉందా? న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల్లో పోల‌వ‌రం ప్రాజెక్టు చిక్కుకుంటుందా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ మ‌ధ్య‌నే పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేంద్రం ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌టం.. ప్రాజెక్టును పూర్తి చేయ‌టానికి అవ‌స‌ర‌మైన నిధుల్ని నాబార్డు చేత ఇచ్చేలా ఏర్పాటు చేయించ‌టం తెలిసిందే. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు క‌నీసం ఆర్నెల్ల ముందే పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేయాల‌న్న త‌లంపుతో బాబు హ‌డావుడిగా ప‌నులు చేయిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాల‌ని కోరుతూ ఒడిశా స‌ర్కారు దాఖ‌లు చేసిన పిటీష‌న్ ను సుప్రీంకోర్టు తాజాగా విచారించింది. పోల‌వ‌రం ప్రాజెక్టు కార‌ణంగా బ్యాక్ వాట‌ర్ తో త‌మ గ్రామాలు మునిగిపోతాయ‌ని ఒడిశా ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. ఇదే స‌మ‌యంలో ఒడిశా మాదిరే త‌మ రాష్ట్రాల‌కు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అభ్యంత‌రాలు ఉన్నాయంటూ తెలంగాణ‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్ ప్ర‌భుత్వాల మ‌ద్ద‌తు కూడా త‌మ‌కు ఉంద‌ని పేర్కొంది. మ‌రోవైపు మ‌హారాష్ట్ర త‌ర‌ఫు న్యాయ‌వాది.. బ‌చావ‌త్ అవార్డు ప్ర‌కారం త‌మ‌కు నీటిలో వాటా ఉంద‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. తెలంగాణ‌.. ఛ‌త్తీస్‌ గ‌ఢ్ రాష్ట్రాల‌కు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. నాలుగు వారాల ప‌రిమిత స‌మ‌యంలో నోటీసుల‌కు త‌గిన  స‌మాధానం ఇవ్వాల‌ని పేర్కొంది. న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల్లో కానీ పోల‌వ‌రం చిక్క‌కుంటే.. అనుకున్న స‌మ‌యానికి ప్రాజెక్టు పూర్తి అయ్యే అవ‌కాశం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News