తెలంగాణలో మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు చేయాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బుధవారం ఊరట కల్పించింది.
కోవిడ్ ఆస్పత్రులు సహా ఇతర ఆస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాల నుంచి నమూనాలు సేకరించి వైద్యపరీక్షలు నిర్వహించకపోవడంపై తెలంగాణ హైకోర్టు కొద్దిరోజుల క్రితం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరణించిన వారికి కూడా కరోనా టెస్టులు చేయాలని ఆదేశించింది.
మృతదేహాలకు కరోనా పరీక్షలను మే 20 నుంచి తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు, మే 26న కెసిఆర్ ప్రభుత్వాన్ని మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది, అయితే కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం కష్టమని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. సుప్రీంకోర్టులో హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసింది.
ఈ కేసును బుధవారం విచారించిన జస్టిస్ జె అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులు సబబు కాదని, తెలంగాణ హైకోర్టు ఇచ్చినట్లు మృతదేహాలన్నింటినీ పరీక్షించాలన్న ఆదేశాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
అంతకుముందు, తెలంగాణ ప్రభుత్వం తన ఆదేశాన్ని పట్టించుకోకపోవడాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్ -19 టెస్టులు చేసే వారికి పీపీఈ రక్షణ పరికరాల సరఫరాపై మునుపటి ఆదేశాలను పాటించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనందుకు కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించవలసి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది.