2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికార పక్షాలు పోటా పోటీగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలాంటి పనులు నైతికమా - అనైతికమా అనే విషయం పార్టీ ఫిరాయించినవారికి - అనధికారికంగా అహ్వానించినవారికి, చూస్తున్న ప్రజలకూ అందరికీ తెలిసిందే.. కాబట్టి ఆ విషయం కాసేపు పక్కనపెడితే... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం తాజాగా సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రోహింగ్టన్ ఫాలీ నారిమన్ - జస్టిస్ ఆర్కే అగర్వాల్ లు నిర్ణయించారు.
అయితే ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు కొందరు తమ రాజీనామాలను స్పీకర్ కి సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేక అధికారాల నేపథ్యంలో ఇప్పటివరకూ స్పీకర్ వద్ద ఉన్న పిటిషన్ల విచారణ పెండింగులో ఉన్నందువల్ల దానిపై కోర్టులు జోక్యం చేసుకోలేవని అటార్నీ జనరల్ వాదించారు. ఈ క్రమంలో ఈ విషయమై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. అయితే ఈ విషయాలపై స్పందించిన ధర్మాసనం... గతంలో ఈ అంశంపై తీర్పు ఇచ్చినప్పటికి, పరిస్థితులు ఇప్పుడు చాలా మారాయని, నేడు దేశంలో ఏం జరుగుతోందో చూస్తున్నాం కదా అని వ్యాఖ్యానించింది. అలాగే స్పీకర్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులు జోక్యం చేసుకుంటాయని, అలాంటిది పిటిషన్లు పెండింగులో ఉన్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని ప్రశ్నించిన ధర్మాసనం... అనర్హత పిటిషన్లు స్పీకర్ వద్ద దీర్ఘకాలం పెండింగులో ఉండిపోతే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా అని ప్రశ్నించింది.
కాగా... ఫిరాయింపుల ద్వారా పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల విచారణను స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని, వారందరిపైనా అనర్హత వేటు వేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈ విషయంపై స్పందించిన సుప్రీంకోర్టు... దీనిపై నిర్ణయం ఎప్పటిలోగా తీసుకుంటారో ఈనెల 8వ తేదీన చెప్పాలని తెలంగాణ స్పీకర్ కు సూచించింది. అయితే తాజాగా జరిగిన మంగళవారం నాటి వాదనల్లో కొత్త అంశాలు తెరపైకి రావడంతో... ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువరిస్తే ఇక అది అన్ని రాష్ట్రాలకూ ఒక మార్గదర్శకంగా ఉంటుంది. ఎందుకంటే... ప్రాథమిక హక్కులకు - ప్రజాస్వామ్య స్ఫూర్తికి సంబంధించిన కేసులు వచ్చినప్పుడు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇస్తే... ఇక వాటిని సవాలు చేయడానికి కూడా వీల్లేదు!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/