సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఒకటి చెప్పింది. అనారోగ్యంతో ఉన్న భార్యను వదిలించుకునే మొగుళ్లకు మొట్టికాయ వేస్తూ.. విడాకుల పిటీషన్ తిరస్కరించటమే కాదు.. ఆమెకు తక్షణ వైద్య సాయం కోసం రూ.5లక్షల్ని వారం వ్యవధిలో ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా హిందూమతంలో వివాహ బంధానికి ఉన్న ఔన్యత్యాన్ని వివరిస్తూ.. విడాకులు కోరుకున్న భర్తకు చీవాట్లు పెట్టినంత పని చేసింది.
అంతేకాదు.. అనారోగ్యంతో ఉన్న భార్య తనకు తానుగా విడాకులు తీసుకోవాలన్న సంసిద్ధతను ప్రదర్శించినా ఒప్పుకునేది లేదని తేల్చింది. హిందూమతంలో వివాహం అన్నది ఒక పవిత్రమైన కార్యక్రమంగా చేస్తామని.. అలాంటి పవిత్ర బంధాన్ని అనారోగ్యం కారణంగా విడాకులు మంజూరు చేయటం సాధ్యం కాదంది. హిందూ సమాజంలో భర్తను దేవుడిగా భావిస్తారని.. అలా చస్తారని.. భర్త కోసం ఇంటి పని మొత్తం చేసే భార్యకు అనారోగ్యం చేస్తే.. విడాకులు ఇచ్చేసి వదిలించుకునే తీరును తప్పుపట్టింది.