జ‌ల్లిక‌ట్టు..కోడి పందాలు..సుప్రీంకోర్టు

Update: 2017-01-12 17:47 GMT
సంప్ర‌దాయ పండుగ‌ల‌పై సుప్రీంకోర్టు నిక్క‌చ్చిగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల తెలుగు సంప్ర‌దాయ‌మైన కోడిపందాల విష‌యంలో ఇచ్చిన నిక్క‌చ్చి తీర్పునే తమిళుల సంప్ర‌దాయ‌మైన జల్లిక‌ట్లు విష‌యంలోనూ అప్లై చేసింది. జ‌ల్లిక‌ట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాల‌న్న అభ్య‌ర్థ‌న‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జ‌ల్లిక‌ట్టుపై శ‌నివారం లోపే తీర్పును వెల్ల‌డించాల‌ని చేసిన అభ్య‌ర్థ‌న‌పైను సుప్రీంకోర్టు నిరాక‌రిస్తూ...త్వ‌ర‌గా ఆదేశాలు ఇవ్వాల‌ని బెంచ్‌ను అడ‌గ‌డం స‌మంజ‌సం కాద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. కోర్టు ప‌నిని త్వ‌ర‌గా ముగించాల‌ని ఎవ‌రూ అడ‌గ‌రాద‌ని తీర్పులో సుప్రీం స్ప‌ష్టం చేసింది.

జ‌ల్లిక‌ట్టుకు అనుమ‌తి ఇచ్చే విష‌యంలో తీర్పుకు సంబంధించిన ముసాయిదా రెఢీగా ఉన్నా, శ‌నివారం లోపే తీర్పును వెల్ల‌డించ‌డం కుద‌రద‌ని సుప్రీం తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుపై త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కూడా స్పందించింది. రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రూ జ‌ల్లిక‌ట్టుపై అనుమ‌తి కోసం ఆత్రంగా ఉన్నార‌ని పేర్కొంది. జ‌ల్లిక‌ట్టుపై సుప్రీంకోర్టు త‌న అభిప్రాయాన్ని మార్చుకోవాల‌ని వేడుకుంటున్న‌ట్లు అన్నాడీఎంకే నేత సీఆర్ స‌ర‌స్వ‌తి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో అసంతృప్తి చెందిన డీఎంకే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News