చట్టసభల్లో సభ్యులు చేసే అభ్యంతరకర ప్రసంగాలు - వ్యాఖ్యలకు సంబంధించి నిబంధనలు రూపొందించాల్సిందిగా సుప్రీంలో నీలకేదార్ గోఖలే అనే మహిళా న్యాయవాది వ్యాజ్యం దాఖలు చేశారు. బీఎస్ పీ అధినేత్రి మాయావతిపై బహిష్కృత బీజేపీ నేత దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వ్యాజ్యం దాఖలయింది. అయితే ఈ విషయాలపై స్పందించిన సుప్రీం ఈ విషయాలపై తాము ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేమని తేల్చేసింది. చట్ట సభల్లో సభ్యులు చేసే ప్రసంగాలను సవాలు చేయకుండా రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నాయి. ఈ విషయంలో "మీరు చెప్పింది నిజమే అయినప్పటికీ ఇది మా పరిధిలోకి రాదు.. సమస్య పరిష్కారానికి మరో చోట ప్రయత్నించండి.. ఈ విషయంపై నిబంధనలు రూపొందించాలని పార్లమెంటును మేము అడగలేం" అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
చట్టసభలకు ఉన్న ప్రాధాన్యత - వారికున్న స్థాయిని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది. రాజ్యాంగానికి లోబడి భారతదేశంలో జరిగే ఏ విషయంపై అయినా స్పందించి - అవసరమైతే చివాట్లు పెట్టే అత్యున్నత ధర్మాసనం కూడా ఈ విషయాలపై స్పందించలేదంటే... మన నేతలకు చట్టసభల్లో ఉన్న గౌరవం ఎంతో తెలుస్తోంది. అయితే ఈ గౌరవానికి తగ్గట్లు ప్రజలచేత - ప్రజలకొరకు ఎన్నుకోబడినవారు ప్రవర్తిస్తున్నారా? ప్రజాసేవకులమని చెప్పి చట్టసభల్లో కూర్చుని ప్రజాసమస్యలపై చర్చిస్తున్నారా? ప్రజల సమస్యలు గాలికొదిలేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నారా? ఈ ప్రశ్నలు ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అనే స్థాయిలో వారిలో చాలామంది ప్రవర్తన ఉంది. ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా, రాజకీయంగా తమకు అనుకూలంగా ఉన్న నిర్ణయాలు ప్రకటించేదిగా చేస్తోన్న నేతలు - చట్టసభల గొప్పతనాన్ని, వారు కూర్చుంటున్నది దేవాలయాల్లోని గర్భగుడిలాంటిదని గుర్తిస్తే మంచిది.
కాగా, గుజరాత్ లో దళితులపై దాడిపై గతంలో రాజ్యసభలో విపక్షాలు చర్చకు పట్టుపడుతున్న నేపథ్యంలో బిజెపి నేత దయాశంకర్ చేసిన వ్యాఖ్యలపై ఈ వ్యాజ్యం దాఖలైంది. రాజ్యసభలో మాయావతి ని వేశ్యతో పోలుస్తూ - ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే టిక్కెట్లు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇతడి నోటి దురదకి - నిస్సిగ్గు వ్యాఖ్యలకు - యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఈయన్ని బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/